విషాదం:పెళ్ళి మండపంలోనే వరుడు మృతి, వధువు ఇలా..
వివాహం రోజునే ఓ వ్యక్తి మరణించాడు. పెళ్ళి మండపంలోనే తాళికట్టే సమయానికి గుండెపోటుతో కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలిస్తే ఆయన గుండెపోటుతో మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు.
కర్ణాటక:వివాహం రోజు చాలా మంది జీవితంలో మరిచిపోలేని రోజు.జీవితాంతం తమ పెళ్ళిరోజును గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు.అయితే పెళ్ళి చేసుకొనే రోజునే విషాదం చోటుచేసుకొంది . తాళికట్టడానికి ముందే వరుడు గుండెపోటుతో మరణించిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని తమకూరు తాలూకా మల్లసంద్ర గ్రామానికి చెందిన యువతితో వసంత్ కుమార్ కు వివాహం నిశ్చయమైంది.ఈ వివాహం కోసం రెండు కుటుంబాల సభ్యులు భారీగా ఏర్పాట్లు చేశారు.
శనివారం రాత్రి రిసెప్షన్ నిర్వహించారు. ఆదివారం ఉదయం తాళి కట్టాల్సి ఉంది. ఆదివారం ఉదయం వివాహ ముహుర్తంగా పండితులు నిర్ణయించారు.

అయితే పెళ్ళి మండపలంలోనే వరుడు వసంత్ కుమార్ కుప్పకూలాడు. వసంత్ కుమార్ తాళికట్టే ముందు పెళ్ళిమంటపంలోనే కుప్పకూలాడు.
అయితే అతణ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే ఆయన మరణించాడని వైద్యులు ప్రకటించారు. గుండెపోటు రావడంతో వసంత్ కుమార్ మరణించాడని వైద్యులు ప్రకటించారు.
అయితే ఈ విషయం తెలిసిన తర్వాత వధువు స్పృహ కోల్పోయింది. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకొన్నాయి.












Click it and Unblock the Notifications