వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: మరికొన్ని క్షణాల్లో పెళ్ళి, వరుడికి వైద్య పరీక్షలు, పెళ్ళి వద్దన్న వధువు

మరికొన్ని క్షణాల్లో వివాహం. రెండు కుటుంబాలకు చెందిన పెళ్ళి పెద్దలు వచ్చారు.అయితే పెళ్ళీ పీటలపైకి ఎక్కబోయిన వరుడి కాళ్ళు తడబడ్డాయి.వరుడి పరిస్థితిని చూసిన వధువు పెళ్ళిని రద్దు చేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చండీఘడ్: మరికొన్ని క్షణాల్లో వివాహం. రెండు కుటుంబాలకు చెందిన పెళ్ళి పెద్దలు వచ్చారు.అయితే పెళ్ళీ పీటలపైకి ఎక్కబోయిన వరుడి కాళ్ళు తడబడ్డాయి.వరుడి పరిస్థితిని చూసిన వధువు పెళ్ళిని రద్దు చేసుకొంది. డ్రగ్స్ కు బానిసగా మారిన వరుడిని తాను పెళ్ళి చేసుకోబోనని వధువు తేగేసి చెప్పింది. దీంతో వరుడి కుటుంం షాకైంది.

పంజాబ్ లోని దీనానగర్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకొంది, గురుదాస్ పూర్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది. ఈ పట్టణంలోని దసరా గ్రౌండ్ కు చెందిన లారీ డ్రైవర్ కుమార్తై సునీతా సింగ్ కు ఇటీవలే జస్ ప్రీత్ సింగ్ అనే యువకుడితో పెళ్ళి కుదిరింది.

Groom fails dope test, bride cancels wedding

మహారాజా రంజిత్ సింగ్ గురుద్వారాలో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగాయి.భారీ ఊరేగింపుతో పెళ్ళికొడుకు కారులో నుండి కాలు బయటపెట్టాడు. కారు నుండి బయటకు దిగగానే పెళ్ళికొడుకు కాళ్ళు తడబడ్డాయి.

కనీసం వరుడు పెళ్ళి పీటల వద్దకు కూడ నడవలేని పరిస్థితిని వధువు సునీత గమనించింది.అతడు బాగా డ్రగ్స్ తీసుకొన్నాడని సునీత గుర్తించింది. డ్రగ్స్ కు బానిసగా మారిన వరుడిని తాను పెళ్ళి చేసుకోనని సునీత తెగేసి చెప్పింది.

లారీ డ్రైవర్ గా పనిచేసే జస్ ప్రీత్ కాలికి గాయమైంది. అతడి అడుగులు తడబడుతున్నాయని నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించారు.కానీ సునీత మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.పెళ్ళి కొడుకు వెంటనే వైద్య పరీక్షలకు తీసుకెళ్ళాలని ఆమె డిమాండ్ చేసింది.

గురుదాస్ పూర్ లోని ప్రైవేట్ ల్యాబ్ లో పరీక్షలు చేయించాల్సిందిగా వధువు డిమాండ్ చేసింది. అక్కడ పరీక్షలు నిర్వహిస్తే జస్ ప్రీత్ డ్రగ్స్ తీసుకొన్నట్టు తేలింది. దీంతో గురుద్వారాకు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో పెళ్ళికొడుకుపై సునీత ఫిర్యాదు చేసింది.

చివరకు రెండు కుటుంబాలు పెళ్ళిని రద్దు చేసుకొనేందుకు అంగీకరించాయి. అంతకుముందు మార్చుకొన్న బంగారు ఉంగరాలను తిరిగి తీసుకొన్నారు. తన కూతురు మంచి నిర్ణయం తీసుకొందని , పెళ్ళి చేసుకొన్న తర్వాత కూడ అతడు డ్రగ్స్ సేవించి వస్తే ఆమె ఎలా సంతోషంగా ఉంటుందని సునీత తండ్రి అభిప్రాయపడ్డారు.

English summary
Sunita, a resident of Dusshera Ground, walked to the police station, 300 m away from the gurdwara where her marriage was to be solemnised to report the issue.The matter came to light when Sunita found the groom, Jaspreet Singh of Khanpur (Mukerian), faltering at almost every step. While Jaspreet’s parents claimed that their son was not at all intoxicated, Sunita asked them to go for his medical check-up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X