డబుల్ హ్యాట్రిక్: ఆముగ్గుర్నీ పట్టుకున్న మోడీ: బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ కారణం !
అహ్మదాబాద్: గుజరాత్ లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్న బీజేపీకి అభివృద్ధి ఎజెండా తప్ప మరో మార్గం లేదు. పాటీదార్లు సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఏం చెయ్యాలి అంటూ బీజేపీ ఆలోచిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ల రూపంలో ప్రధాని నరేంద్ర మోడీకి వరుస అవకాశాలు లభించాయి.

దేవుడి రూపంలో చిక్కారు
రాహుల్ గాంధీ చేసిన ఓ సంతకం, సుప్రీం కోర్టులో కపిల్‌సిబల్ వాదనలు, ప్రధాని నరేంద్ర మోడీపై మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాయి. ఈ మూడు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చగా బీజేపీ చేతికి అస్త్రాలను అందించాయి. దేవుడి రూపంలో వచ్చిన ఈ మూడు అవకాశాలను బీజేపీ నాయకులు చక్కగా ఉయోగించుకున్నారు.

రాహుల్ గాంధీ
హిందుత్వ ప్రయోగశాలగా భావించే గుజరాత్‌లో హిందూ దేవాలయాలను రాహుల్ గాంధీ సందర్శించడంపై బీజేపీ విమర్శలు సంధించింది. సోమ్‌నాథ్ ఆలయంలో హిందూయేతర రిజిస్టర్‌లో రాహుల్ గాంధీ సంతకం చేయడం వివాదాస్పదమైంది. రాహుల్ గాంధీ సంతకం విషయంలో బీజేపీ హిందువులను టార్గెట్ చేసుకుంది. రాహుల్ గాంధీ తాను హిందువు కాదని ఆయనే అంగీకరిస్తు సోమనాథ్ ఆలయంలోని రిజిస్టర్ లో సంతకం చేశారని బీజేపీ ఆరోపించింది.

సుప్రీం కోర్టులో కపిల్
అయోధ్య భూ వివాదంలో 2019 లోక్ సభ ఎన్నికల తరువాత విచారణ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో వాదించారు. ఈ విషయాన్ని పట్టుకున్న మోడీ గుజరాత్ ఎన్నికల సందర్బంగా ఇక్కడ ఆలయాలు తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో రామ మందిరం నిర్మాణాన్ని అడ్డుకుంటోందని ఆరోపణలు గుప్పించారు.

హిందూత్వ ఎజెండా
గుజరాత్ శాసన సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ మళ్లీ హిందూత్వ ఎజెండాను నమ్ముకుంది. అది కాంగ్రెస్ రూపంలో రావడంతో బీజేపీ ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ దెబ్బకోట్టాలో అక్కడే బీజేపీ దెబ్బ కొట్టింది. హిందువుల ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది.

అయ్యారే అయ్యర్
2014 లోక్ సభ ఎన్నికల సందర్బంగా ప్రధానిని చాయ్ వాలా అంటూ విమర్శించిన కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మణిశంకర్ అయ్యర్ 2017లో ప్రధాని నరేంద్ర మోడీకి మరో చక్కటి అవకాశం ఇచ్చారు. ప్రధాని మోడీ నీచుడు (నీచ్) అంటూ విమర్శించిన మణిశంకర్ అయ్యర్ బీజేపీ చేతికి మంచి అస్త్రం అదించారు. తనను మాత్రమే నీచుడు అని మణిశంకర్ అయ్యర్ విమర్శించలేదని, ప్రతి గుజరాతీని ఆయన అవమానించారని ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభల్లో ఆరోపణలు చేశారు.

పాకిస్థాన్ తెరమీదకు
మణింకర్ అయ్యర్ మరో సారి బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు. తన ఇంటికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ, పాక్ అధికారులను పిలిపించి సమావేశం నిర్వహించారు. దాయాది పాకిస్థాన్ ను అడ్డం పెట్టుకున్న బీజేపీ మమల్ని ఓడించడానికి శత్రు దేశం పాక్ తో చేతులు కలిపిన కాంగ్రెస్ కు తగిన బుద్ది చెప్పాలని గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేసింది. చేతికి చిక్కిన ఈ అవకాశాలను బీజేపీ చక్కగా సద్వినియోగం చేసుకోవడంతో గుజరాత్ లో ఆరో సారి అధికారంలోకి వస్తోంది. ఈ వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీశాయి.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications