వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly elections 2022: ముగిసిన తొలి దశ పోలింగ్: 60 శాతం ఓటింగ్ నమోదు

|
Google Oneindia TeluguNews

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రెండు దశల్లో ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత ఎన్నికలు డిసెంబర్ 1వ తేదీన జరిగాయి. ఈ సారి ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. దశాబ్దాల తర్వాత అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. తన బలమైన కోటగా చెప్పుకునే గుజరాత్ పీఠాన్ని మరోసారి దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు పంజాబ్‌లో గెలిచి అదే ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళుతోంది కేజ్రీవాల్ ఆమ్‌ఆద్మీ పార్టీ.

Gujarat Assembly elections 2022 live updates in telugu:Top fights in first phase

గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి.ఇందులో 89 నియోజకవర్గాలకు డిసెంబర్ 1న తొలిదశ పోలింగ్ ముగిసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
8:04 PM, 1 Dec

ఈరోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 60.20% (సుమారు) ఓటింగ్ నమోదైంది: భారత ఎన్నికల సంఘం
7:19 PM, 1 Dec

తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను భద్రపరిచే పడ్డారు ఎన్నికల అధికారులు.
7:18 PM, 1 Dec

రోడ్ షో సందర్భంగా ప్రధాని మోడీ.. సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
6:21 PM, 1 Dec

గుజరాత్ తొలి దశ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
5:56 PM, 1 Dec

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం.
5:50 PM, 1 Dec

గుజరాత్‌లో జరుగుతున్న మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలలో సాయంత్రం 5 గంటల వరకు 56.88% ఓటింగ్ నమోదైంది.
4:27 PM, 1 Dec
గుజరాత్

19 జిల్లాలవారీగా పోలింగ్ శాతాన్ని ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యధికంగా తాపిలో 63.98 శాతం, అత్యల్పంగా జామ్ నగర్‌లో 42.44 శాతం పోలింగ్ నమోదైంది.
4:02 PM, 1 Dec
గుజరాత్

ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితికి చేరుకునేది కాదని మోదీ ఎదురుదాడి చేశారు. ఒకే కుటుంబాన్ని నమ్ముతారని, అది ప్రజాస్వామ్యం కాబోదని అన్నారు.
3:44 PM, 1 Dec
గుజరాత్

మధ్యాహ్నం 3 గంటల వరకు 48.48 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.
3:16 PM, 1 Dec
గుజరాత్

రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కలోల్‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
3:14 PM, 1 Dec
గుజరాత్

మల్లికార్జున ఖర్గె నన్ను వంద తలల రావణుడితో పోల్చారు. నిజానికి మేము రామభక్తులం. ఈ ఎన్నికల్లో రామభక్తులు సత్తా చాటుతారు. ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు.- ప్రధాని మోదీ
3:07 PM, 1 Dec
గుజరాత్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, పలువురు కేంద్రమంత్రులు వేర్వేరు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. రోడ్ షోలను నిర్వహిస్తోన్నారు.
2:28 PM, 1 Dec
గుజరాత్

గుజరాతీయులు రామభక్తులు- కాంగ్రెస్‌కు తమ సత్తా ఏమిటో చూపిస్తారు- పంచమహల్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
1:53 PM, 1 Dec
గుజరాత్

మధ్యాహ్నం ఒంటిగంట వరకు 34.48 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు.
1:48 PM, 1 Dec
గుజరాత్

పంచమహల్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
1:30 PM, 1 Dec
గుజరాత్

రాజ్‌కోట్ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 26 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన కలెక్టర్ అరుణ్ మహేష్.
1:15 PM, 1 Dec

మలివిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లో, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మెహ్‌సానాలో రోడ్ షోలల్లో పాల్గొంటున్నారు.
1:09 PM, 1 Dec
గుజరాత్

ఈ నెల 5వ తేదీన మలి విడత అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొననున్న నియోజకవర్గాల్లో హోరెత్తుతున్న ప్రచారం. కేంద్రమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోన్నారు.
12:32 PM, 1 Dec
గుజరాత్

తాపి పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రఫుల్‌భాయ్ మోరె. ఈ ఉదయం ఆయన పెళ్లి. దీనికోసం మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉంది. ఓటు వెయ్యాలనే ఉద్దేశంతో పెళ్లి ముహూర్తాన్ని సాయంత్రానికి మార్చుకున్నాడు.
12:22 PM, 1 Dec
గుజరాత్

రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లోని సనంద్‌లో రోడ్ షోలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఈ నెల 5వ తేదీన రెండో విడత పోలింగ్ జరుగనుంది.
12:16 PM, 1 Dec
గుజరాత్

సూరత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అల్పేష్ కథిరియా. మెడ నిండా పూలదండలతో ఆయన పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం కనిపించింది.
12:01 PM, 1 Dec
గుజరాత్

భావ్‌నగర్ హనోల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ భాయ్ మాండవీయ
11:53 AM, 1 Dec
గుజరాత్

ఉదయం 11 గంటల వరకు 18.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషన్.
11:46 AM, 1 Dec
గుజరాత్

సూరత్‌లో ఓటు వేసిన కేంద్రమంత్రి దర్శన జర్దోష్
11:31 AM, 1 Dec
గుజరాత్

ఉమర్‌గావ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న వందేళ్ల వయోధిక వృద్ధురాలు కాముబెన్ లాలాభాయ్ పటేల్.
11:28 AM, 1 Dec
గుజరాత్

ఓటు వేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ధ్‌సింహ్ జడేజా, చెల్లెలు నయన జడేజా. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. కోడలు రివాబా జడేజా మాత్రం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
11:10 AM, 1 Dec
గుజరాత్

తమ ఓటు హక్కును వినియోగించుకున్న రాజ్‌కోట్ రాజకుటుంబీకులు. మాంధాతసింహ్ జడేజా థాకూర్ సాహెబ్, కాదంబరీ దేవి.
10:54 AM, 1 Dec
గుజరాత్

సూరత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న హోం శాఖ మంత్రి హర్ష్ సంఘవి
10:45 AM, 1 Dec
గుజరాత్

అంక్లేశ్వర్‌లో ఓటు వేసిన ముంతాజ్ పటేల్. ఆమె- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత అహ్మద్ పటేల్ కుమార్తె.
10:39 AM, 1 Dec
గుజరాత్

జామ్ నగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. ఆయన భార్య రివాబా జడేజా జామ్ నగర్ నార్త్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్నారు.
READ MORE

English summary
Gujarat Assembly elections 2022 live updates in telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X