వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ ఫలితాలు: బీజేపీ అత్తెసరు గెలుపు, మోడీకి సొంతూర్లో షాక్, లెక్కతప్పిన కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Gujarat Election Result : Gifting A Presidency To Rahul రాహుల్ నేగ్గేనా ?

అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ మరోసారి మట్టికరిచింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ ప్రభ తగ్గిపోలేదని గుజరాత్ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. సోమవారం వచ్చిన ఫలితాల్లో బీజేపీ 99 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 80 సీట్లు గెలుచుకుంది.

గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం యావత్ భారత దేశం ఎదురు చూసింది. బీజేపీ అధికార పీఠం నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ పార్టీ కమలం కోట బద్దలు కొడుతుందా అని అందరిలోను ఆసక్తి కనిపించింది. బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకుంది. కమలం పార్టీని ఢీకొట్టాలన్న కాంగ్రెస్ ఆశలు నీరుగారాయి.

బీజేపీకి ఇది ఆరోసారి గెలుపు. బీజేపీని ఓడించి రెండు దశాబ్దాల తర్వాత అధికారం చేపట్టాలని కాంగ్రెస్ భావించింది. ఎందరితో కలిసినా మోడీ-అమిత్ షా జోడీని ఢీకొట్టలేకపోయింది. ఈ ఎన్నికల్లో అభివృద్ది నినాదం వినిపించినప్పటికీ దాని ప్రాధాన్యత చాలా తగ్గింది. కుల, మతాలకు చాలా ప్రాధాన్యత లభించింది. కాంగ్రెస్, పటీదార్, ఓబీసీ, దళిత యువనాయకులు ఒక్కటైనా మోడీ మాటల మేజిక్, అమిత్ షా వ్యూహంతో బీజేపీ గట్టెక్కింది.

మోడీ సొంతూరులో బీజేపీ ఓటమి

మోడీ సొంతూరులో బీజేపీ ఓటమి

గుజరాత్‌లో తక్కువ సీట్లు రావడం బీజేపీకి పెద్ద దెబ్బ. అయితే ప్రధాని నరేంద్ర మోడీ సొంతూరు వాద్ నగర్‌ ఉన్న ఉంఝాలో బీజేపీ ఓటమి ఆయనకు అతి పెద్ద షాక్. అల్పేష్ ఠాకూర్ గెలుపొందారు. కాగా, గుజరాత్‌లో పలువురు ముఖ్య నేతలు ఓడిపోయారు. పోరుబందర్ నుంచి కాంగ్రెస్ నేత అర్జున్ మోద్వాడియా ఓటమి చవిచూశారు. సిధ్‌పూర్ నుంచి బీజేపీ నేత నారాయణ స్వామి ఓడిపోయారు.

వడ్గామ్ నుంచి జిగ్నేష్ మేవానీ గెలుపు

వడ్గామ్ నుంచి జిగ్నేష్ మేవానీ గెలుపు

దళిత నేత జిగ్నేష్ మేవానీ వడ్గాం నియోజకవర్గం నుంచి 10,785 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఆయనకు మద్దతు పలికింది. కాంగ్రెస్, తదితరుల మద్దతుతో ఈయన విజయం సాధించారు.

స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కిన సీఎం విజయ్ రూపానీ

స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కిన సీఎం విజయ్ రూపానీ

ముఖ్యమంత్రి విజయ్ రుపానీ రాజ్ కోట్ వెస్ట్ నుంచి గెలుపొందారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఆయన ఒకటి రెండుసార్లు వెనుకబడ్డారు. 4700 ఓట్ల మెజార్టీతో ఆయన గట్టెక్కారు. రూపానీ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంద్రనీల్ రాజ్‌గురు. ముఖ్యమంత్రికి గట్టిపోటీ ఇచ్చారు. మెహసానాలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ విజయం సాధించారు.

ప్రాబల్యం ఉన్న సీటు కోల్పోయిన బీజేపీ

ప్రాబల్యం ఉన్న సీటు కోల్పోయిన బీజేపీ


బీజేపీ ప్రాబల్యం ఉన్న జమాల్‌పూర్ ఖాడియా నుంచి ఆ పార్టీ అభ్యర్థి భూషణ్ భట్ ఓటమి చవి చూశారు. గత ఎన్నికల్లో భట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సమీర్‌ఖాన్ సిపాయి పైన ఆరువేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

 ఫలితాలు ఊహించినవే

ఫలితాలు ఊహించినవే

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ ఫలితాలు ఊహించినవే అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటుకు వచ్చారు. మరోవైపు, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీని కలిశారు. ఈ గెలుపుతో ప్రధాని మోడీకి ప్రజలు మరోసారి మద్దతిచ్చారని తెలిపారు.

2007లో, 2012లో ఎవరికి ఎన్ని సీట్లు?

2007లో, 2012లో ఎవరికి ఎన్ని సీట్లు?

బీజేపీకి 2007లో 117, 2012లో 119 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 2007లో 59, 2012లో 57 సీట్లు వచ్చాయి. ఎన్సీపీకి 2007లో 3, 2012లో 2 సీట్లు, జేడీ(యూ)కు 2007లో 1, 2012లో 1 సీటు వచ్చింది. గుజరాత్ పరివర్తన్ పార్టీకి 2012లో రెండు సీట్లు రాగా, స్వతంత్రులకు 2007లో 2, 2012లో ఒక సీటు వచ్చింది. 2012లో బీజేపీకి 47.9 శాతం ఓట్లు రాగా, 119 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 31.3 శాతం ఓట్లు రాగా 57 సీట్లు వచ్చాయి. ఎన్సీపీకి 1.1 శాతం ఓట్లు రాగా, 2 సీట్లు వచ్చాయి. ఈసారీ గుజరాత్‌లో బీజేపీదే అధికారం అని 7 ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి.

కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన అర్బన్, బీజేపీకి గ్రామీణ షాక్

కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన అర్బన్, బీజేపీకి గ్రామీణ షాక్

55 గుజరాత్ అర్బన్ నియోజకవర్గాల్లో బీజేపీ 43 స్థానాల్లో, కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలుపొందింది. 127 గుజరాత్ రూరల్ నియోజకవర్గాల్లో బీజేపీ 56 సీట్లు గెలిచింది. గుజరాత్‌లో బీజేపీకి అత్తెసరు మెజార్టీ వచ్చింది. ఇద్దరు కేబినెట్ మంత్రులు సహా మొత్తం ఐదుగురు మంత్రులు ఓడిపోయారు. ఒక మంత్రి అయితే కేవలం మూడు వందల పై చిలుకు ఓట్లతో గెలిచారు. గతంలో మోడీ నియోజకవర్గమైన మణి నగర్‌లో బీజేపీ 75వేలకు పైగా ఓట్లతో గెలిచింది.

English summary
The counting of votes for the Gujarat Assembly elections 2017 will be held on Monday. The counting will begin at 8 am and results are expected by afternoon. The 182-member Gujarat Assembly went to polls in two phases on the 9th and 14th of this month. The political fate of 1,828 candidates will be decided in this election. The counting of votes will be held at 37 centres across the state's 33 districts, amid tight security. More than 30,000 personnel have been deployed to monitor the counting process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X