వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోరాజీ హార్దిక్‌కు బస్తీమే సవాల్.. బరిలో ఆయన సన్నిహితుడే మరి

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: సంప్రదాయంగా ధోరాజీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. పాటిదార్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత విథల్ రాడాడియా ఇప్పటివరకు ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి విత్తల్ రాడాడియా బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ అత్యంత సన్నిహితుడు లలిత్ వాసోవాను బరిలోకి దించింది.
పటేళ్లకు పట్టుగొమ్మగా ఉన్న రాజ్‌కోట్ జిల్లాలో మాజీ ఎంపీ హరిలాల్ పటేల్ బీజేపీ సీనియర్ నాయకుడు ఉన్నారు. కాకలు తీరిన యోధుడిగా హరిలాల్ పటేల్‌ను పాస్ మాజీ నాయకుడు లలిత్ వాసోవా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రస్తుతం విథల్ రాడాడియా పోర్ బందర్ ఎంపీగా ఉన్నారు.

 ప్రచారాస్త్రంగా ‘అభివృద్ధి' నినాదం

ప్రచారాస్త్రంగా ‘అభివృద్ధి' నినాదం

ఈ నియోజకవర్గం కూడా పాటిదార్లకు పెట్టింది పేరు. అయితే ముస్లింలు, దళితులు కూడా గణనీయ సంఖ్యలోనే ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయగల సామర్థ్యం వారి సొంతం. ఈ దఫా మాత్రం స్థానిక అభివృద్ధి ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ధోరాజీ పట్టణంలో రోడ్డు వసతులు ఫేలవంగానూ, అండర్ గ్రౌండ్ డ్రైనీజీ వ్యవస్థ నిర్మాణం అసంపూర్తిగానూ ఉన్నాయి. వీటికితోడు రైతులు కులాలు, సామాజిక వర్గాలకతీతంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పత్తి, వేరుశనగ పంటలపై కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కోసం ఆందోళన చెందుతున్నారు.

 మున్సిపాలిటీలో అవినీతి, రైతుల ఎమ్మెస్పీపై ప్రచారాస్త్రాలు

మున్సిపాలిటీలో అవినీతి, రైతుల ఎమ్మెస్పీపై ప్రచారాస్త్రాలు

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లలిత్ వాసోవా మాట్లాడుతూ పాటిదార్లు, కులాల సమస్య కంటే స్థానిక అంశాలే చాలా ప్రధానంగా చర్చకు వస్తున్నాయని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న నగర పాలికలో అండర్ గ్రౌండ్ డ్రైయినేజీ వ్యవస్థ ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నదని తెలిపారు. పాస్ మాజీ నాయకుడు వాసోవా దూకుడుగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ధోరాజీ మునిసిపాలిటీలో అవినీతి, గ్రామాల్లో రైతుల పంటలకు ఎమ్మెస్పీ అంశాలను గుర్తుచేస్తూ ప్రచారం చేస్తున్నారు.

పాటిదార్లపై హీరాలాల్ పటేల్ ఆశలిలా..

పాటిదార్లపై హీరాలాల్ పటేల్ ఆశలిలా..

‘గత మూడేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పత్తి, వేరుశనగ, పప్పు ధాన్యాల పంటలకు కనీస మద్దతు ధర సంపాదించడం ప్రధాన అంశంగా మారింది. రైతులు తమ పంటలపై కనీస పెట్టుబడి కూడా సంపాదించలేకపోయారు. వివిధ సామాజిక వర్గాల వారు కూడా సంబంధం లేకుండా కనీస మద్దతు ధర కోసం పోరాడుతున్నారు‘ అని వాసోవా అంటున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి హీరాలాల్ పటేల్ మాట్లాడుతూ పాటిదార్ల సామాజిక వర్గం వారితోపాటు అభివృద్ధి పేరిట ఓట్లడుతుతున్నట్లు కోరారు.

 రైతుల పంటలకు ఎమ్మెస్పీపై సర్కార్ ఇలా

రైతుల పంటలకు ఎమ్మెస్పీపై సర్కార్ ఇలా

‘అభివ్రుద్ది మా ప్రధాన అంశం. రాష్ట్ర ప్రభుత్వం ధోరాజీ అభివ్రుద్ధి కోసం రూ.110 కోట్లు కేటాయించింది. అండర్ గ్రౌండ్ సీవరేజీ సిస్టమ్ కోసం ఈ నిధులు ఖర్చు చేశాం. సగం పని పూర్తయింది' అని హీరాలాల్ పటేల్ తెలిపారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో హీరాలాల్ పటేల్.. పోర్‌బందర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. పత్తి రైతులకు ప్రతి 20 కిలోలకు ఎమ్మెస్పీపై రూ.100 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సంగతిని రైతులు అర్థం చేసుకోవాలని అంటున్నారు. హీరాలాల్ పటేల్ మాట్లాడుతూ విద్యావంతులైన పాటిదార్లు అర్థం చేసుకున్నారని తెలిపారు. బీజేపీ సారథ్యంలోని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు వారికి తెలుసునన్నారు. పటేళ్లు తనకు మద్దతు ఇవ్వకపోవడానికి వేరే సమస్యలే లేవని హీరాలాల్ పటేల్ అన్నారు.

 వాసోవాపై స్థానికేతరుడన్న ముద్ర

వాసోవాపై స్థానికేతరుడన్న ముద్ర

బీజేపీకి పటేళ్లు ఓటేయకుండా ఉండేందుకు వాసోవాను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి తీసుకు వచ్చింది. పాటిదార్ అన్న ట్యాగ్‌తో బరిలోకి దిగిన వాసోవాను స్థానికేతరుడన్న ముద్ర కాంగ్రస్ పార్టీకి కాసింత ఇబ్బందికరంగా ఉంది. అయితే తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాసోవా.. ఓబీసీ కోటాలో పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని చేసిన ఆందోళనలో ముందు పీఠిన నిలువడం కలిసి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అభ్యర్థులంతా స్థానికులా? కాదా? అన్న సంగతి ఓటర్లు పట్టించుకోరని అంటున్నారు. ధోరాజీకి సంబంధించిన వరకు బీజేపీ కూడా స్థానికేతరుడేనని వాసోవా గుర్తు చేశారు.

 2013లో బీజేపీలో చేరేందుకు ఎమ్మెల్యేగా రాజీనామా

2013లో బీజేపీలో చేరేందుకు ఎమ్మెల్యేగా రాజీనామా

2012 అసెంబ్లీ ఎన్నికల్లో విథల్ రాడాడియా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత బీజేపీలో 2013లో చేరారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ మకాడియా విజయం సాధించారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతగా బరిలోకి దిగిన వాసోవా తిరిగి ధోరాజీ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. ధోరాజీ అసెంబ్లీ స్థానం నుంచి 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్), యునైటెడ్ జనతాదళ్, బీఎస్పీ పార్టీలతోపాటు మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా సారథ్యంలోని జన్ వికల్ప్ అభ్యర్థితోపాటు మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.

English summary
Dhoraji has traditionally been a stronghold of Congress. Veteran Patel community leader Vitthal Radadiya was elected from the seat for five times on Congress’ ticket before he quit the party and joined the BJP. The contest on Dhoraji seat of Gujarat will be a prestige issue for Patidar Anamat Andolan Samiti (PAAS) leader Hardik Patel as one of his key aides, Lalit Vasoya, is contesting from there on Congress’ ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X