Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముగిసిన గుజరాత్ అసెంబ్లీ తొలిదశ పోలింగ్: 5 గంటల వరకు 60 శాతం పోలింగ్

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తొలి దశ ముగిసింది.
గుజరాత్‌లోని 89 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి దశ పోలింగ్ గురువారం సాయంత్రం 5 గంటలకు ముగియగా.. 56.88% ఓటింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 60 శాతానికిపైగా ఓటింగ్ శాతం నమోదైందని వెల్లడించారు.

కొన్ని స్వల్ప హింసాత్మక సంఘటనలు జరిగినప్పటికీ.. పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగింది. తొలి దశలో 339 మంది స్వతంత్ర అభ్యర్థులు సహా 788 మంది అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో భద్రపర్చారు.

Gujarat: First Phase Of Polling Ends With 56.9% Voter Turnout Till 5 PM

వంస్దా నియోజకవర్గం నుంచి బీజేపీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి పియూష్ పటేల్‌పై ఝరీ గ్రామంలో దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 5 వాహనాలు కూడా దెబ్బతిన్నాయని నవ్‌సారి ఎస్పీ గిరీష్ పాండ్యా తెలిపారు. గాయపడిన పటేల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గురువారం ఉదయం నెమ్మదిగా ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం వరకు ఊపందుకుంది. ఉదయం 9 గంటల వరకు 4.92% ఓటింగ్ నమోదైంది. ఉదయం 11 గంటలకు ఈ సంఖ్య 18.95%కి పెరిగింది. ఇది మధ్యాహ్నం 1 గంటలకు 34%, తరువాత 3 గంటల వరకు 48.48% పెరిగింది.

సౌరాష్ట్ర-కచ్ తీర ప్రాంతం, గుజరాత్‌లోని దక్షిణ ప్రాంతాలలోని 19 జిల్లాల్లో ఓటింగ్ బాగా జరిగింది. 89 నియోజకవర్గాలలో 54 సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో ఉన్నాయి.

గుజరాత్ ఎన్నికల 2022 తొలి దశలో ఓటు వేసిన వారిలో కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, పర్సోత్తమ్ రూపాలా, దర్శన బెన్ జర్దోష్, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, కర్ణాటక మాజీ గవర్నర్ వజుభాయ్ వాలా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు పరేష్ ధనానీ, క్రికెటర్ రవీందర్ జడేజా, అతని కుటుంబం, ఆప్ అభ్యర్థి అల్పేష్ కతిరియా, మాజీ రాజ్‌కోట్ రాజ కుటుంబ సభ్యులు మంధాతసిన్హ్ జడేజ్ ఠాకోర్ సాహెబ్, కాదంబరీ దేవి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాగా, గుజరాత్ ఎన్నికల రెండో దశ డిసెంబర్ 5న జరగనుంది. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు డిసెంబర్ 8న విడుదల కానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+