వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్దిక్ పటేల్: దేశ ద్రోహం కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: పటేళ్లను ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న హర్దిక్ పటేల్ మీద సూరత్ పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు హర్దిక్ పటేల్ మీద నమోదు చేసిన కేసు విషయంలో పటేళ్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

పటేళ్లను ఓబీసీలలో చేర్చాలని హర్దిక్ పటేల్ ఆదివారం రాజ్ కోట్ లో నిరసన వ్యక్తం చెయ్యడానికి సిద్దం అయిన విషయం తెలిసిందే. భారత్- దక్షిణ ఆఫ్రికా జట్ల మద్య జరుగుతున్న వన్డే మ్యాచ్ ను అడ్డుకోవడానికి వెళ్లారు.

Gujarat Police have now filed an FIR against Hardik Patel

ఆ సందర్బంలో జాతీయ జెండాను చేతపట్టుకున్న హర్దిక్ పటేల్ తన అనుచరులతో కలిసి కారు దిగాడు. కారు దిగుతున్న సమయంలో జాతీయ జెండా హర్దిక్ పటేల్ కాలుకు చిక్కుకుందని, దేశాన్ని అవమానించే విధంగా అతను ప్రవర్తించాడని కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ గగన్ దీప్ అన్నారు.

అదే విధంగా పటేళ్లను రెచ్చగొట్టి ప్రసగించి గొడవలు జరగడానికి ప్రయత్నిస్తున్నాడని హర్దిక్ మీద కేసు నమోదు చేశారు. రిజర్వేషన్ల కోసం పటేల్ యువకులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరాదని, అవసరమైతే పోలీసులను చంపాలని ఈనెల 3వ తేదిన హర్దిక్ పటేల్ సూరత్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయ్యింది.

English summary
A day after he was detained for trying to block the road of Team India and South Africa ahead of 3rd ODI, Gujarat Police have now filed an FIR against Hardik Patel of sedition over his controversial remark.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X