ప్లాన్‌తోనే: లగడపాటి అరెస్ట్‌కు డిమాండ్, చాకుపై వివరణ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ ముసాయిదా బిల్లు)ను లోకసభలో ప్రవేశ పెట్టే సమయంలో సీమాంధ్ర ప్రాంత ఎంపీలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారని తెలిసి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ ముందస్తు ప్రణాళిక రచించినట్లుగా తెలుస్తోంది.

సీమాంధ్ర ఎంపీలను అడ్డుకోవాలని ఎస్పీ, బిఎస్పీ, ఆర్జెడి, కాంగ్రెస్ రాష్ట్రేతర ఎంపీలకు కమల్ నాథ్ సూచించినట్లుగా తెలుస్తోంది. దాంతో వారు సీమాంధ్ర ఎంపీలను అడ్డుకున్నారు. కమల్ పథకం ప్రకారమే హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు, సభాపతి మీరా కుమార్‌కు రక్షణగా ఎంపీలను నిలిపినట్లుగా తెలుస్తోంది.

Gurudas Dasgupta demands arrest of Lagadapati

మోదుగుల సూసైడ్ యత్నం

సీమాంధ్ర టిడిపి ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఓ దశలో ఆత్మహత్యాయత్నం చేశారు. లోకసభ సెక్రటరీ జనరల్ వద్ద టేబుల్ అద్దాలు పగులగొట్టి పొడుచుకునే ప్రయత్నాలు చేశారు. మోదుగుల, లగడపాటిపై తెలంగాణ ఎంపీలు పిడిగుద్దులు గుద్దారని సీమాంధ్ర ఎంపీలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సభకు చాకు తీసుకువచ్చానన్న ఆరోపణలను మోదుగుల ఖండిస్తున్నారు. తాను ఎలాంటి చాకు తీసుకు రాలేదని, మైక్ విరగ్గొట్టానని, గ్లాసు పగుల గొట్టానని, అవి మాత్రమే తన చేతులో ఉన్నాయన్నారు.

లగడపాటి అరెస్టుకు డిమాండ్

సభలో పెప్పర్ స్ప్రే చల్లిన లగడపాటిని అరెస్టు చేయాలని సిపిఐ నేత గురుదాస్ దాస్ గుప్తా డిమాండ్ చేశారు. కమల్ నాథ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము సభాపతికి విజ్ఞప్తి చేస్తామని కమల్ నాథ్ అన్నారు. ఎంపీలపై చర్యలు తీసుకుంటామని షిండే చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+