'గబ్బర్ బ్యాక్' నినాదాలు, కావాల్సింది ఛాతి కాదన్న హార్థిక్ పటేల్

Subscribe to Oneindia Telugu

సూరత్ : పటేల్ రిజర్వేషన్ల ఉద్యమంతో దేశవ్యాప్తంగా అందరి ద్రుష్టిని ఆకర్షించిన హార్థిక్ పటేల్ (22) గురువారం ఉదయం లజ్ పోర్ జైలు నుంచి విడుదలయ్యారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గాను గత అక్టోబర్ లో అరెస్టయిన హార్థిక్ 9 నెలల అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు.

అయితే విడుదలైన ఆరు నెలల వరకు గుజరాత్ రాష్ట్రంలో ఉండరాదన్న నిబంధన మేరకు హార్థిక్ విడుదల జరిగింది. జైలు నుంచి విడుదలైన హార్థిక్ కు మద్దతు పలికేందుకు పెద్ద ఎత్తున పటీదార్ సామాజిక వర్గం జైలు వద్దకు చేరుకుంది. విడుదలైన సమయంలో తెల్లటి దుస్తులు ధరించి ఉన్న హార్థిక్ తలకు స్కార్ఫ్ కట్టుకున్నారు.

Hardik Patel,22, Leaves Jail 9 Months After Being Arrested For Sedition

కాగా, హార్థిక్ విడుదలపై ఆనందోత్సాహాల్లో మునిగిపోయిన మద్దతు దారులంతా 'గబ్బర్ ఈజ్ బ్యాక్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. అయితే ఆరు నెలల వరకు రాష్ట్రంలో ఉండరాదన్న నిబంధన మేరకు గుజరాత్ ను వీడేందుకు హార్థిక్ కు రెండు రోజుల గడువు ఇచ్చింది న్యాయస్థానం. దీంతో ఈ ఆరు నెలల పాటు కొన్నిరోజులు రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో, మరికొన్ని రోజులు ఉత్తరప్రదేశ్ లో హార్థిక్ గడపనున్నట్టు సమాచారం.

జైలు నుంచి విడుదలయిన అనంతరం మీడియాతో మాట్లాడిన హార్థిక్.. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో శాంతియుత చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తామన్నారు. అలాగే 56 అంగుళాల ఛాతీ మాకు అవసరం లేదని చెప్పిన హార్థిక్, రిజర్వేషన్ల సాధనే తమ ధ్యేయం అన్నారు.

అనంతరం తన మద్దతుదారులతో కలిసి సూరత్ లో రోడ్ షో లో పాల్గొంటున్న హార్థిక్, తన స్వగ్రామం విరాంగంకు చేరుకోనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hardik Patel, 22, walked out of a prison in Gujarat this morning, nine months after he was jailed for sedition. He has to leave the state for six months, which was a condition for his release.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి