గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా హర్థిక్ పటేల్, తక్షణమే అమల్లోకి నియామకం..
గుజరాత్‌లో బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. పాటిదార్ ఉద్యమ నేత హర్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అతనికి ప్రాధాన్యం పెంచుతున్నారు. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఇందుకు సంబంధించి అధినేత్రి ఆమోదం తెలిపారని.. హర్దిక్ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
గుజరాత్ పీసీసీ చీఫ్‌గా ప్రస్తుతం అమిత్ చావ్డా ఉన్నారు. ఆయన అధ్యక్షుడిగా ఉండగా.. హర్దిక్ పటేల్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతం అవుతోందని హై కమాండ్ భావిస్తోంది. పాటిదార్ కమ్యూనిటీలో హర్ధిక్ పటేల్‌కు మంచి క్రేజ్ ఉంది. మూడేళ్ల క్రితం నాటి అల్లర్ల కేసులో గతేడాది హర్థిక్ పటేల్‌ను అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

పటేల్లకు రిజర్వేషన్ కల్పించాలని హర్థిక్ పటేల్ ఉద్యమించారు. ఆయన ఉద్యమంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది. అతనిపై అక్రమ కేసులు బనాయించి.. అరెస్ట్ చేశారు. స్వస్థలం గుజరాత్ కూడా రానీయలేదు. తర్వాత అతను కాంగ్రెస్ పార్టీలో చేరి.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీ చేపట్టే వరకు ఎదిగారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications