గాలికి ఊరట: రూ.884 కోట్ల ఆస్తుల జప్తు ఆదేశాలను రద్దు చేసిన కోర్టు

కర్ణాటకలో మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దనరెడ్డి, ఆయన భార్య అరుణాలక్ష్మిలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలు చేసిన కేసును రద్దు చేస్తూ కర్ణాటక ఉన్నత న్యాయస్థానం సోమవారం.

బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దనరెడ్డి, ఆయన భార్య అరుణాలక్ష్మిలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలు చేసిన కేసును రద్దు చేస్తూ కర్ణాటక ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశాలను వెలువరించింది.

ఓబుళాపురం గనుల సంస్థ, బ్రాహ్మణి ఉక్కు, జనార్దనరెడ్డి ఇల్లు, హెలికాప్టర్లు తదితరాలను జప్తుచేస్తూ 2011లో కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో జప్తుచేసిన ఆస్తుల విలువ రూ.884 కోట్లుగా లెక్కగట్టారు. కాగా, 2004-2006 సంవత్సరాల్లో జనార్దన్‌ అక్రమంగా ఈ ఆస్తులను కూడగట్టుకున్నారన్న ఆరోపణలపై ఈడీ వాటిని స్వాధీనపరచుకుంది.

HC QUASHES CASE AGAINST JANARDHAN REDDY

2009లో కేంద్ర ప్రభుత్వం పిఎంఎల్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌) చట్టానికి సవరణలను చేసిందని, అంతకు ముందున్న నిబంధనల ప్రకారం ఈడీ ఆదేశాలు చెల్లవని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్రతో కమల్‌ ముఖర్జీతో కూడిన ధర్మాసనం సోమవార ఈ మేరకు తీర్పునిచ్చింది.

కాగా, ఇటీవల తన కుమార్తె వివాహ వేడుకను ఘనంగా నిర్వహించి గాలి జనార్ధన్ రెడ్డి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సుమారు 500 కోట్ల రూపాయలకు పైగా ఈ వివాహానికి గాలి ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+