ఆత్మసాక్షి ఓటు అంటే క్రాస్ ఓటింగ్ అని అర్థం చెప్పింది ఇందిరా గాంధీ, నీచమైన బుద్ది, మాజీ సీఎం ఫైర్ !

ఎన్నికల విధానంలో కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్‌కు జన్మనిచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి విమర్శించారు. దేశ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద మచ్చ అని మాజీ సీఎం కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని, అందుకు కారణం కాంగ్రెస్ అని ఆ పార్టీపై విరుచుకుపడిన కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది మనస్సాక్షి ఓటుతో కాదని, క్రాస్ ఓటింగ్ వల్లేనని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ ఇదేనా అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. దేశంలో మనస్సాక్షి ఓటు అనే పదాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది కాంగ్రెస్. మనస్సాక్షి ఓటు అంటే క్రాస్ ఓటింగ్ అని మాజీ సీఎం హెచ్ డీ కుమాస్వామి ఆరోపించారు. ఇదే సందర్బంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే విషయాన్ని కుమారస్వామి వివరించారు.

HD Kumaraswamy accused of cross-voting in Rajya Sabha elections by threatening MLAs of other parties.

1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన కీలుబొమ్మను గెలిపించుకోవాలని నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేసిన వివి గిరిని కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా చేయాలని కోరుకున్నారని కుమారస్వామి ఆరోపించారు. తరువాత మనస్సాక్షికి ఓటు వేయాలని అప్పట్లో ఇందిరాగాంధీ పిలుపునిచ్చారని కుమారస్వామి అన్నారు. అప్పట్లో పార్టీ అధికారిక అభ్యర్థిగా ఉన్న నీలం సంజీవరెడ్డిని ఓడించడానికి కాంగ్రెస్ నాయకులు అంతరాత్మ అలియాస్ క్రాస్ ఓట్లతో ఆయన్ను ఓడించారని, ఆ పాపం ఇందిరాగాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులదే అని కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు

క్రాస్ ఓటు అనే పదానికి నిర్వవచనం కాంగ్రెస్ పార్టీ అని కుమారస్వామి విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల నాటికి జేడీఎస్-బీజేపీ కూటమి మరింత బలపడింది. ప్రజాస్వామ్యంలో ద్రోహులు, రాజ్యాంగ ద్రోహులు ఎవరు? అంటే టక్కున చెప్పే మాట కాంగ్రెస్ నాయకులు అని ప్రజలు అంటున్నారని కుమారస్వామి ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేసి అక్కడ అధికారాన్ని అనుభవించిన వారు ఇప్పుడు అదే బీజేపీలో ఉంటూ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడి బీజేపీకి ద్రోహం చేశారని కుమారస్వామి ఆరోపించారు.

HD Kumaraswamy accused of cross-voting in Rajya Sabha elections by threatening MLAs of other parties.

గత ఏడెనిమిది నెలలుగా సీఎం సిద్దరామయ్య ఏం చేస్తున్నారో మీడియా స్వయంగా చూపించిందని,. దీనితో బీజేపీ షాక్ అవ్వలేదని, నేను కూడా షాక్ అవ్వలేదని, లోక్‌సభ ఎన్నికల్లో అసలైన గేమ్‌ ఉంటుందని కుమారస్వామి మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. జేడీఎస్ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని, అందరూ వచ్చి బీజేపీ- జేడీఎస్ కూటమి అభ్యర్థి కుపేంద్ర రెడ్డికి ఓటు వేశారని, మా పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించాలన్న కాంగ్రెస్ వ్యూహం ఫలించలేదని కుమారస్వామి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+