కాంగ్రెస్ రెండు తలల పాము, వాడోరకం, వీడోరకం, మోదీ విషయంలో క్లారిటీ ఉందా !
రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు మంజూరు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ ఫిబ్రవరి 6వ తేదీన చలో ఢిల్లీ నిరసనకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు తలల పాములాగా తయారైయ్యింది. కేంద్ర ప్రభుత్వం విషయంలో ఆ పార్టీ రెండు రకాలుగా మాట్లాడుతోందని మాజీ సీఎం కుమారస్వామి దుయ్యబట్టారు.
పన్నుల వాటా, గ్రాంట్లు కేటాయించడంలో కర్ణాటక రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ ఛలో ఢిల్లీ యాత్రకు బయలుదేరుతున్న కాంగ్రెస్ పార్టీ రెండు తలల రాజకీయం చేసి చివరికి ఎటూ కాకుండా పోతున్నదని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు కర్ణాటకలో ఒక విధానంగా ఉందని. కేరళలో మరో విధానంగా ఉందని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న మాజీ సీఎం కుమారస్వామి కాంగ్రెస్ రాజకీయాలపై విమర్శలు గుప్పించారు.

కేరళ సీఎం పినరయి విజయన్ ఇటీవల మాట్లాడుతూ కేరళ రాష్ట్రానికి పన్నుల వాటా, గ్రాంట్లు కేటాయించడంలో అన్యాయం జరుగుతోంది. కేంద్రంపై మనం గళం విప్పాలని, అందరూ కలిసి వచ్చి కేరళ ప్రభుత్వానికి సహకరించండి అంటూ కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు మనవి చేశారని కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి గుర్తు చేశారు. మీరు అనవసర ఖర్చులకు ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని, మీతో కలిసి మేం రావడం లేదని కేరళ కాంగ్రెస్ నాయకులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు తేల్చి చెప్పారని, కేరళ సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ నాయకులు హాజరుకాలేదని కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు.

-
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications