షాక్: ఇంటర్ స్టేట్ టాపర్‌ సన్యాసం తీసుకున్నాడు, ఎందుకంటే?

Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో జరిగిన 12వ తరగతి పరీక్షల్లో 17ఏళ్ల అహ్మదాబాద్ కుర్రాడు వర్షిల్ షా 99.99శాతం మార్కులతో ఉత్తీర్ణుడై టాపర్‌గా నిలిచాడు. అయితే, అందరు విద్యార్థుల్లా భవిష్యత్‌‌లో మంచి హోదాలో ఉండాలని అతడు కోరుకోలేదు. అతడు తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వివరాల్లోకి వెళితే.. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన వర్షిల్ షా గురువారం సూరత్ పట్టణంలో సన్యాసం స్వీకరించాడు. కళ్యాణ్ మహారాజ్ అనే జైన సన్యాసిని స్ఫూర్తిగా తీసుకుని షా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

He topped class 12th exam in Gujarat; now to become a monk

తన నిర్ణయంపై వర్షిల్ షా మీడియాతో మాట్లాడుతూ... 'అత్యధిక మార్కులు సాధించినప్పటికీ... అందరిలాగా భూ సంబంధమైన ఆస్తులు సంపాదించడం నాకిష్టం లేదు. ఆత్మ శాంతి, శాశ్వితమైన ఆనందం సంపాదించడమే నా లక్ష్యం. నా వెనుక ఉన్నవాటిన్నిటినీ వదలేసి, జైన సన్యాసిగా మారినప్పుడే అది సాధ్యం' అని వర్షిల్ చెప్పుకొచ్చారు.

కాగా, అతడి నిర్ణయానికి కుటుంబం సైతం సంపూర్ణ అంగీకారం తెలిపింది. శుక్రవారం సూరత్‌లో జరిగే ఓ వేడుకలో వర్షిల్ దీక్ష స్వీకరించనున్నాడు. ఇది ఇలా ఉండగా, వర్షిల్‌తో పాటు అతడి సోదరి జైనిని కూడా బాల్యం నుంచి అత్యంత నిరాడంబరంగా పెంచారనీ, ఆ కుటుంబానికి ఆథ్యాత్మిక భావాలు ఎక్కువని స్థానికులు చెబుతున్నారు.

జైన మత సిద్ధాంతాల ప్రకారం 'జీవదయ'ను పాటించడం వీరికి నేర్పించినట్టు తెలిపారు. జీవులకు ఇబ్బంది కలగకుండా వర్షిల్ షా ఇంట్లో విద్యుత్ కూడా చాలా తక్కువగా ఉపయోగిస్తారు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఇంట్లో కనీసం టీవీ, రిఫ్రిజిరేటర్ వంటివికూడా లేకపోవడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Seventeen-year-old Varshil Shah, an Ahmedabad resident, scored 99.99 percentile in the class 12th examination in Gujarat. Now he is set to become a Jain monk.
Please Wait while comments are loading...