తమిళనాడులో తప్పని తిప్పలు.. మరో 24 గంటలు భారీ వర్షాలే!

Posted By:
Subscribe to Oneindia Telugu
  Heavy Rains In Tamil Nadu Continue For Next 2-3 Days | Oneindia Telugu

  చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. భారీ వర్షాలతో అతలాకుతలమవుతోన్న రాష్ట్రానికి వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త అందించింది. అల్పపీడనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

  ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి బాలచంద్రన్‌ తెలిపారు. అంతేకాదు, మరో రెండు, మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశమున్నట్లు ఆయన చెప్పారు. ఈ హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది.

  chennai-rains

  ఈశాన్య రుతుపవనాల ప్రభావానికి తోడు అల్పపీడనం తోడుకావడంతో చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  రామేశ్వరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. మంగళవారం నాలుగు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నలుగురు మృతిచెందారని ప్రభుత్వం ప్రకటించింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Meteorological Department on Tuesday said that incessant rains in Tamil Nadu will continue for the next 2-3 days with the coastal region expected to witness "heavy to very heavy" rainfall in the next 24 hours. The IMD on Monday predicted heavy to very heavy rainfall in Chennai and at least eight other coastal districts in Tamil Nadu. Chennai and other coastal areas in Tamil Nadu started getting rainfall since Monday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి