తీరాన్ని తాకిన హెలెన్ తుఫాన్, ఇద్దరు మృతి(పిక్చర్స్)
హైదరాబాద్: హెలెన్ తుఫాను శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకింది. తీరాన్ని తాకడానికి ముందు వేగంగా గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కోస్తాలో భీకర తుఫాను కురుస్తోంది. తుఫాను దాటికి రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. కోస్తాంధ్రలో నీటి అలలు ఒకటి నుండి ఒకటిన్నర మీటర్లు ఎత్తుకు ఎగిసిపడ్డాయి.
మచిలీపట్నం వద్ద మధ్యాహ్నం తీరాన్ని తాకిన తుఫాను సాయంత్రం తీరాన్ని దాటింది. మరికొద్ది గంటల్లో ఇది క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారనుంది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.
కాగా, హెలెన్ తుఫాను తీరం వైపు దూసుకొస్తున్నట్లుగా ఉదయం నుండి అధికారులు హెచ్చరిస్తున్నారు. నేడు మధ్యాహ్నం హెలెన్ తుఫాను మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశముందని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హెలెన్ తీరం దాటే సమయంలో వంద నుండి నూటా యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చునని చెప్పారు. 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కురిసే అవకాశముందని చెప్పారు. ఉదయం హెలెన్ మచిలీపట్నానికి తూర్పు దిశలో 85 కిలోమీటర్ల దూరంలో, నర్సాపురానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. హెలెన్ తుఫాను కోస్తా ప్రాంతాన్ని అలజడికి గురి చేసింది. తీర ప్రాంతంలో సముద్రం కొన్ని చోట్ల ముందుకు వచ్చింది. అలలు ఎగిసిపడ్డాయి. సముద్రంలో వేటను నిషేధించారు.
నిజాంపట్నం, మచిలీపట్నం ఓడ రేవుల్లో పదో ప్రమాద హెచ్చరిక, కాకినాడలో తొమ్మిదో ప్రమాద హెచ్చరిక, కృష్ణపట్నం, గంగవరం, విశాఖ, కళింగపట్నం ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
హెలెన్ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. తీర ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

హెలెన్
హెలెన్ తుఫాను తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన నేపథ్యంలో నిలిచిపోయిన పడవలు.

హెలెన్ 2
హెలెన్ తుఫాను తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన నేపథ్యంలో ఒడ్డుకు తరలి వస్తున్న ఓ పడవ.

హెలెన్ 3
హెలెన్ తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. నేడు మధ్యాహ్నం హెలెన్ తుఫాను మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశముంది. బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల 24 గంటల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురువనున్నాయి.

హెలెన్ 4
కృష్ణా - పశ్చిమ గోదావరి మధ్య మధ్యాహ్నం మూడు నుండి నాలుగు గంటల మధ్య హెలెన్ తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications