ఈసారి మీ నెలవారీ బిల్లు ఎందుకు పెరిగిందో తెలుసా ? దీని వెనుక ఇంత కథ ఉందా ?
ఈసారి మీ నెలవారీ ఖర్చుల బిల్లు అమాంతం పెరిగిపోయినట్లు కనిపిస్తోందా ? దీనికి పైకి ఎలాంటి కారణాలు కనిపించడం లేదా ? ప్రభుత్వం పన్నులు పెంచకపోయినా హఠాత్తుగా ఈ పెరుగుదల ఎందుకు కనిపిస్తున్నట్లు అంటే కొన్ని పరోక్ష కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధాన మైనవి అస్ధిర రుతుపవనాలు, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాలు, వాటిని అదుపు చేయడంలో ప్రభుత్వాల వైఫల్యం.. ఇలాచెప్పుకుంటూ పోతే చాలా కారణాలే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో నమోదైన 4.81% నుండి జూలైలో 15 నెలల గరిష్ట స్థాయికి చేరి ఏకంగా 7.44%కి పెరిగింది. దీంతో కూరగాయల ధరలు, ముఖ్యంగా టమాటాలు, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయాయి.ఏప్రిల్ 2022లో నమోదైన ద్రవ్యోల్బణం 7.79% తర్వాత ఇదే అత్యధికంగా భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ద్రవ్యోల్బణం నాలుగు నెలల పాటు పరిమితుల్లో ఉన్న తర్వాత.. ఆర్బీఐ ఇచ్చిన పరిధి 2-6%ని దాటేసింది. దీంతో ఆహార ద్రవ్యోల్బణం వినియోగదారుల ఖర్చుల్లో దాదాపు సగం వాటా ఆక్రమించింది.

జూలైలో వినియోగదారుల ఆహార ధరల సూచిక 11.51%కి పెరిగింది. 2020 అక్టోబర్ తర్వాత ఇదే అత్యధిక స్థాయిగా నమోదైంది.ఏడాది ప్రాతిపదికన కూరగాయల ద్రవ్యోల్బణం 37.43%కి చేరుకుంది. గత నెలలో 1% తగ్గిన కూరగాయల ద్రవ్యోల్బణం నాటకీయంగా అమాంతం పెరిగిపోయింది. వీటితో పాటు తృణధాన్యాలు, ఉత్పత్తుల ధరలు కూడా చెప్పుకోదగ్గ స్దాయిలో పెరిగాయి. జూన్‌లో 12.7% నుండి ఇవి 13%కి పెరిగాయి.
గత వారం ఆర్బీఐ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 5.4%కి సవరించింది. ఆహార ధరల ఒత్తిడిని ప్రస్తావిస్తూ..జూన్ సమావేశంలో ప్రకటించిన 5.1% అంచనాను పెంచింది. జూలై-సెప్టెంబర్‌కు ద్రవ్యోల్బణం అంచనా ఇప్పుడు 6.2%గా ఉంది. ఇది గత అంచనా 5.2% కంటే ఎక్కువ. మరోవైపు దేశంలో రుతుపవనాలు ఊపందుకున్నాయి. కానీ అస్దిరంగా ఉన్నాయి. వరి పండించే ప్రాంతాలలో లోటు వర్షపాతం పంటల విత్తనాన్ని ప్రభావితం చేస్తోంది. అలాగే ఎల్ నినో ప్రభావం కూడా ఆందోళన కలిగిస్తోంది. అస్థిరమైన రుతుపవనాల కారణంగా టొమాటోలు దాని హోల్‌సేల్ మార్కెట్ ధరలలో 1,400% కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేశాయి.
మరి ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా ? ధరల కట్టడి పేరుతో భారతదేశం తన అతిపెద్ద బియ్యం ఎగుమతిని నిలిపివేసింది. తద్వారా ప్రపంచ ఆహార మార్కెట్లలో ద్రవ్యోల్బణ ఆందోళనలను మరింత పెంచింది.మరోవైపు జూలైలో వరుసగా నాలుగో నెలలో టోకు ద్రవ్యోల్బణం ప్రతికూలంగా ఉంది. కూరగాయల ధరల పెరుగుదల జూన్ గణాంకాలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల నమోదు చేస్తోంది.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Pakistan: ఏప్రిల్ 4 నుంచి లాక్ డౌన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం.. -
రూపాయిపై సర్జికల్ స్ట్రైక్! బ్యాంకులకు నిద్రలేని రాత్రులే -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications