బెంగాల్ లో రధయాత్రకు అనుమతి : మమతకు హైకోర్టు షాక్..
బిజెపి కోరుకున్నదే జరిగింది. పశ్చిమ బెంగాల్ లో రధయాత్ర నిర్వహించాలని బిజెపి చాలా పట్టుదలతో ఉంది. అయితే బెంగాల్ ప్రభుత్వం రధయాత్ర కు అనుమతి నిరాకరించింది. దీని పై బిజెపి ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. దీని పై విచారణ జరిపిన హైకోర్టు కొన్ని సూచనలు చేస్తూ రధయాత్ర కు అనుమతి ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ ఇచ్చింది. బీజేపీ తలపెట్టిన రథయాత్ర కు అను మతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. బిజెపి రాష్ట్రంలో రధయాత్ర చేస్తే రాష్ట్రంలో మత ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందంటూ బీజేపీ రథయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరిం చింది. న్యాయ స్థానం అనుమతి ఇస్తూనే కొన్ని కీలక సూచనలు చేసింది. ర్యాలీ ప్రవేశించేం దుకు కనీసం 12 గంటల ముందు ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం ఇవ్వాలంటూ బీజేపీని జస్టిస్ చక్రవర్తి ఆదేశించారు. చట్టానికి లోబడి యాత్' నిర్వహించాలనీ... వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని బీజేపీ నేతల కు న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇదే సమయంలో యాత్రకు సంబంధించి పూర్తి బాధ్యత బిజెపి నాయకత్వమే వహించాలని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రం లో ప్రభుత్వ ఆస్తులను ఏ మాత్రం నష్టం వాటిల్లినా బిజెపి నాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయమూ ర్తి చక్రవర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో రధయాత్ర నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ బిజెపి నాయకత్వం ఇప్పటిక ఏర్పాట్లు చేసుకుంది. దాదాపు 45 రోజుల పాటు రాష్ట్రంలోని 42 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. కోర్టు తీర్పుతో బిజెపి హర్షం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications