గూగుల్ క్రోమ్ పాతది వాడుతున్నారా? కొత్తదా?.. కేంద్రం హెచ్చరిక

పాపులర్ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ యూజర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. కంప్యూటర్లలో పాత క్రోమ్ బ్రౌజర్ ఉపయోగిస్తున్నవారు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని హెచ్చరించింది. భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్ ఆఫ్ ఇండియా ఈ హెచ్చరికను జారీచేసింది. క్రోమ్ బ్రౌజర్ లో లోపాలవల్ల రిమోట్ యాక్సెస్ ద్వారా కంప్యూటర్ యాక్సెస్ చేయడంతోపాటు సమాచారాన్ని కూడా తస్కరించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

గూగుల్ క్రోమ్ విండోస్ వెర్షన్ 116.5845.110/111 మ్యాక్, వెర్షన్ 116.0.5845.110 కంటే ముందు వెర్షన్ల బ్రౌజర్లను వినియోగిస్తున్నవారికి ముప్పు పొంచివుందని పేర్కొంది. ఆయా బ్రౌజర్లలో లోపాలవల్ల రిమోట్ గా దాడిచేసే వ్యక్తి.. సిస్టంలోకి ఆర్బిడరీ కోడ్ లను జొప్పిస్తారని, అలాగే సర్వీస్ లను తిరస్కరిస్తారని, సిస్టమ్స్ లో ఉన్న సమాచారాన్ని బయటపెడతారని తెలిపింది. సెర్ట్ ఇన్ వన్ తన హెచ్చరికల్లో తెలిపింది.

high risk warning for google chrome users

గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ అప్ డేట్ చేసుకోవాలని కోరింది.మీరు గూగుల్ క్రోమ్ వెర్షన్ ఏది వాడుతున్నారో తెలుసుకోవాలనుకుంటే.. బ్రౌజర్ ను ఓపెన్ చేయాలి. కుడివైపున మూడు చుక్కలపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ ఉంటాయి.

అందులో సెట్టింగ్స్ పేజీలో ఎడమవైపు ఉండే జాబితాలో చివర్లో అబౌట్ క్రోమ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ప్రస్తుత బ్రౌజర్ వెర్షన్ తోపాటు అప్ డేటమ్ అయిందా? లేదా? అనేది చూపిస్తుంది. బ్రౌజర్ అప్ డేట్ కాకుంటే రీలాంచ్ చేసి అప్ డేట్ చేయాలి. బ్రౌజర్ ఆటోమేటిక్ గా అప్ డేట్ అయితే క్రోమ్ ఈజ్ అప్ టూ డేట్ అని చూపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+