Hijab Row: జాతీయ జెండాను దింపేసి కాషాయం జెండా ఎగరేసిన విద్యార్థులు, లాఠీచార్జ్, 144 సెక్షన్ !
బెంగళూరు/ శివమొగ్గ/ హైదరాబాద్: హిజాబ్ వివాదం రోజురోజుకు ముదిరిపోతోంది. హిజాబ్ (బుర్కా) వేసుకుని మేము కాలేజ్ కు వస్తామని ముస్లీం అమ్మాయిలు పట్టుబడుతున్నారు. హిజాబ్ లు వేసుకోవడానికి అమ్మాయిలకు అనుమతి ఇస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని వస్తాయని కొందరు అబ్బాయిలు పట్టుబడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన కొన్ని స్వచ్చంద సంస్థలు ఇప్పటికే కర్ణాటక చేరుకుని ముస్లీం అమ్మాయిలకు మద్దతు ఇచ్చారు. ఇక శివమొగ్గ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 144 సెక్షన్ అమలు చేశారు. ఇప్పటికే పోలీసులు లాఠీలకు పని చెప్పి ఎగిరిపడుతున్న కొందరికి దేహశుద్ది చేశారు. జాతియ జెండా ఎగరవేయడానికి ఏర్పాటు చేసిస స్థంభానికి కషాయం జెండా కట్టడంతో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాజకీయ వివాదం
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో విద్యాసంస్థల్లో ముస్లీం అమ్మాయిలు బుర్కాలు వేసుకుని వస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని నుదిటి మీద సింధూరం పెట్టుకుని కాలేజ్ లోకి వస్తామని హిందులు పట్టుబడుతున్నారు. కాలేజ్ విద్యార్థుల గొడవలతో మొదలైన బుర్కాల వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది.

నిలదీస్తున్న విద్యార్థులు
విద్యాసంస్థల్లో ముస్లీం అమ్మాయిలు బుర్కాలు వేసుకుని వస్తే మేము కూడా కాషాయం కండువాలు వేసుకుని నుదిటి మీద సింధూరం పెట్టుకుని కాలేజ్ లోకి వస్తామని హిందులు పట్టుబడుతున్నారు. ఇప్పుడు ఉడిపి జిల్లాలో మొదలైన హిజాబ్ వివాదం కర్ణాటక వ్యాప్తంగా వ్యాపించింది. విద్యాసంస్థల ఆవరణంలో హిజాబ్ ధరించి రాకూడదని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాలేజ్ ల్లోకి ఇన్ని సంవత్సరాలు హిజాబ్ ధరించి వచ్చి చదువుకున్నామని, అప్పుడు లేని నియమాలు ఇప్పుడు ఎందుకు అంటూ ముస్లీం అమ్మాయిలు కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులను నిలదీస్తున్నారు.

ఉడిపిలో 144 సెక్షన్
బుర్కాలు ధరించే విషయంలో శివమొగ్గలో రెండు వర్గాల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. మేము బుర్కాలు వేసుకుని కాలేజ్ కు వస్తామని ఓ వర్గం వారు ర్యాలీ నిర్వహించారు. పోటాపోటీగా మేము కూడా కాషయం కండువాలు వేసుకుని కాలేజ్ కు వెలుతామని మరో వర్గం వాళ్లు ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోటాపోటిగా ర్యాలీలు నిర్వహించడంతో శివమొగ్గలో పోలీసులు ఇరు వర్గాల ర్యాలీలు అడ్డుకొవడానికి 144 సెక్షన్ అమలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Recommended Video

జాతీయ జెండానే దింపేసిన విద్యార్థులు
కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంలో కొందరు విద్యార్థులు కాషయం కండువాలు వేసుకుని ర్యాలీగా వెళ్లారు. జాతియ జెండా ఎగరవేయడానికి ఏర్పాటు చేసిస స్థంభానికి కషాయం జెండా కట్టడంతో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషమం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కాలేజ్ విద్యార్థి జాతీయ జెండాను కిందకు దింపి కాషాయం జెండాను ఎగరవేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications