Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెడ్ అలర్ట్- ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ ప్రభుత్వం విజ్ఞప్తి..!!

సిమ్లా: భారీ వర్షాలు.. ఉత్తరాది రాష్ట్రాలను వదలట్లేదు. అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు పోటెత్తుతున్నాయి.. ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. ఇలా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం ఆయా రాష్ట్రాల్లో నమోదవుతోంది.

హిమాచల్ ప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీ.. భారీ వర్షాలకు చివురుటాకులా వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్, రావి, సట్లేజ్.. నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్నాయి. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యమునా నది ఉప్పొంగింది. హిమాచల్‌లో అన్ని రిజర్వాయర్‌లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. వాటి గేట్లన్నింటినీ ఎత్తివేశారు అధికారులు.

 rains

దీని ప్రభావం తీర ప్రాంతాలపై పడింది. బియాస్, రావి, సట్లేజ్ నదుల తీరప్రాంతాలన్నీ మునిగిపోయాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు. ఇప్పటివరకు లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కొండ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ప్రళయాన్ని తలపించేలా విరుచుకుపడటం వల్ల పలు పట్టణాలు సగం వరకు నీట మునిగాయి.

బిలాస్‌పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, ఉనా, హమీర్‌పూర్, మండి, కుల్లు-మనాలి, కిన్నౌర్, చంబా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాల్లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వచ్చే మూడు రోజుల పాటు మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరించింది. ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.

ఇతర జిల్లాలకు వర్షాలు విస్తరిస్తాయని, ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని ఐఎండీ సూచించింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం హెల్ప్‌లైన్ సెంటర్లను నెలకొల్పింది. 24 గంటల పాటు పని చేసేలా వాటిని ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్‌లైన్ కేంద్రాల నంబర్లు...1100, 1070, 1077.

 rains

అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉన్నందున ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది ప్రభుత్వం. మూడు జాతీయ రహదారులతో సహా మొత్తం 736 రోడ్లను మూసివేసినట్లు రహదారుల శాఖ మంత్రి తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేంత వరకు ప్రయాణాలు మానుకోవాలని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+