గుర్మీత్ నాకు తండ్రి, అన్నీ చెప్పేస్తా: కోర్టులో ఏడ్చేసిన హనీప్రీత్
డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను న్యాయస్థానం ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. పలు విషయాలను హనీప్రీత్ నుంచి పోలీసులు రాబట్టనున్నారు.
Recommended Video

ఢిల్లీ: డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను న్యాయస్థానం ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. పలు విషయాలను హనీప్రీత్ నుంచి పోలీసులు రాబట్టనున్నారు.
డేరా బాబా అరెస్టు అనంతరం అల్లర్లలో ఆమె పాత్ర ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా, గుర్మీత్ అరెస్టు అనంతరం డేరా నుంచి విలువైన వస్తువులు, డబ్బు మరోచోటికి తరలించినట్లుగా భావిస్తున్నారు.

ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగింత
డేరా బాబాతో మంచి సంబంధాలు ఉన్న హనీప్రీత్‌ను విచారిస్తే కీలక విషయాలు రాబట్ట వచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టి, కస్టడీ కోరారు. దీంతో న్యాయస్థానం ఆమెను ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.

దేశద్రోహం కేసు, హనీప్రీత్ కంటతడి
డేరా బాబా అరెస్టు అనంతరం హింసను ప్రేరేపించారంటూ హనీప్రీత్ ఇన్సాన్ పైన పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టిన సమయంలో హనీప్రీత్ న్యాయస్థానంలోనే కన్నీరు పెట్టుకుంది. తనపై అబద్దపు కేసులు పెట్టారని ఆమె ఒక్కసారిగా ఏడ్చింది.

అక్రమ సంబంధంపై హనీప్రీత్ ఆవేదన
డేరా అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని హనీప్రీత్ కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం వెల్లడించింది. గుర్మీత్ తనకు తండ్రిలాంటి వాడని, ఆయనతో అక్రమ సంబంధం అంటగట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పింది. పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెబుతానని చెప్పింది. అన్ని వివరాలు చెబుతానన్నది.

గుర్మీత్ హిందువు కావటం వల్లే
గుర్మీత్ రామ్ రహీం సింగ్ హిందువు కావడం వల్లే ఆయనకీ దుర్గతి పట్టిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా ఇస్లాంలో చేరుతామంటూ సంచలన ప్రకటన చేశారు. సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హిందూ సంస్థలు చాలా సులభంగా టార్గెట్ అవుతున్నాయని, గుర్మీత్ హిందువు కావడం వల్లే ఆయన జైలుకు వెళ్లారని డేరా అనుచరులు ఆరోపించారు.
డేరా అధికార ప్రతినిధి
ఈ మేరకు సోషల్ మీడియాలో డేరా అధికార ప్రతినిధి సందీప్ మిశ్రా ముఖానికి మాస్క్ ధరించి మాట్లాడుతున్న వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. సిర్సాలో ఈ వీడియోను చిత్రీకరించారు. అందులో ఆయన మాట్లాడారు. పలువురు ముస్లీం ప్రముఖులతో టచ్‌లో ఉన్నట్లు కూడా చెబుతున్నారు.

సొంత దేశంలో హిందువుగా పుట్టడం నేరం
మీరు హిందూస్థాన్‌ను అభిమానిస్తే మీ కంటి నుంచి నీరు తప్ప మరేమీ రాదని, మన సొంత దేశంలో హిందువుగా ఉండడం నేరం అయిందని పేర్కొన్నారు. అందుకే మతం మారితే రక్షణ ఉంటుందని సందీప్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

ముస్లీంలను తాకే సాహసం ఎవరూ చేయరు
ఆ వెంటనే ముసుగు ధరించి ఆయన వెనకవైపు ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ.. ఇస్లాంలో చేరడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ముస్లింలను తాకే సాహసం కూడా ఎవరూ చేయబోరని అన్నాడు. వారు రాళ్లు విసిరినా వారిని ఏమైనా అనే ధైర్యం ఎవరికీ ఉండదన్నాడు. తమ నాయకులు ముస్లిం లీడర్లతో మాట్లాడుతున్నారన్నాడు. కాగా, ఇదంతా గుర్మీత్ ఆడిస్తున్న డ్రామా అని, మతం కార్డును ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసునని కొందరు అంటున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications