కాశ్మీర్ వేర్పాటు నేతలు గృహ నిర్బంధం
జమ్మూ: జమ్మూ కాశ్మీర్ లో హురియత్ నేతలను గృహ నిర్బంధం చేశారు. పాకిస్థాన్ హై కమిషన్ కాశ్మీర్ వేర్పాటు నేతలను చర్చలకు ఆహ్వానించిన సందర్బంలో భారత్ అధికారులు ఈ హౌస్ అరెస్టులు చేశారు. వేర్పాటు వాదులు ఢిల్లీ వెల్లకుండ కఠిన చర్యలు తీసుకున్నారు.
జమ్మూ కాశ్మీర్ వేర్పాటు వాదులు యాసిన్ మాలిక్, సయ్యద్ ఆలీ షా జిలానీ, మిర్వజ్ ఊమర్ ఫరూఖ్ లతో సహ 7 మంది ముఖ్య నేతలను గురువారం వేకువ జామున గృహ నిర్బంధం చేశారు. పాకిస్థాన్ దర్యాప్తు సంస్థ సీనియర్ అధికారి సత్తార్ అజీజ్ ఆదివారం ఢిల్లీ చేరుకుంటున్నారు.
భారత్ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సలహాదారు అజిత్ దౌలత్ పాక్ అధికారి సత్తార్ అజీజ్ ఉగ్రవాదం, తదితర విషయాలపై చర్చలు జరపనున్నారు. ఇదే సమయంలో కాశ్మీర్ వేర్పాటు వాదులను చర్చలకు రావాలని పాక్ హై కమిషన్ ఆహ్వానించింది.

పాక్, భారత్ ఉన్నతాధికారులు ఒక సంవత్సరం తరువాత కట్టుదిట్టమైన భద్రతతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి ముందు పాక్ వేర్పాటు వాదులతో చర్చించడానికి సిద్దం కావడం షాక్ కు గురైయ్యామని ఉన్నత స్థాయి పోలీసు అధికారి అన్నారు.
కాశ్మీర్ లోని ఉదమ్ పూర్ లో పాక్ ఉగ్రవాది మహమ్మద్ నావెద్ తో పాటు మరొ ఉగ్రవాది దాడి చెయ్యడం, పంజాబ్ లో పోలీస్ స్టేష్ లో ఉగ్రవాదులు దాడులు చెయ్యడంతో పాక్ కు లింక్ ఉందని వెలుగు చూసింది. ఈ సందర్బంలో చర్చలు మొదలయ్యాయి.
ఇదే సందర్బంలో కాశ్మీర్ వేర్పాటు వాదులు రెచ్చిపోయే అవకాశం ఉండటంతో పోలీసు అధికారులు ముందు జాగ్రత చర్యగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని గంటల తరువాత అరెస్టు అయిన వేర్పాటు వాదులను విడిచిపెట్టామని పోలీసు అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటు వాదులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సైన్యం మొహరిస్తున్నది.












Click it and Unblock the Notifications