అమెరికాలో షీనా సంతోషంగా ఉన్నట్లు..: ఇంద్రాణి 'ఫేక్'
ముంబై: షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి గురించిన షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, పోలీసులు మరో విషయాన్ని గుర్తించారు. షీనా బోరాను ఏప్రిల్ 24, 2012న ఇంద్రాణి హత్య చేసింది. అనంతరం ఆమె బతికే ఉందని చెప్పేందుకు ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది.
షీనా బోరా పేరిట ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్ ఫేక్‌ది అని కేసును విచారణ చేస్తున్న దర్యాఫ్తు అధికారులు చెప్పారు. కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా కూతురు షీనా పేరిట ఫేక్ అకౌంటు క్రియేట్ చేసిందని చెప్పారు.

ఫేక్ అకౌంటు క్రియేట్ చేసిన ఇంద్రాణీ.. దానిని ఆమె ఆపరేట్ చేసింది. షీనా పేరుతో దానిని కొనసాగించింది. అంతేకాదు, ఆమె షీనాకు చెందిన పలు ఫోటోలను తన భర్త పీటర్ ముఖర్జియాకు చూపించేది. తద్వారా షీనా అమెరికాలో సంతోషంగా ఉందనే అభిప్రాయం ఆయనలో కలిగించేది.
సమాచారం మేరకు, పోలీసుల విచారణ పీటర్ ముఖర్జీయా.... ఇంద్రాణి తనకు అమెరికాలో ఉన్న షీనా ఫోటోలు చూపించేదని, తద్వారా ఆమె సంతోషంగా ఉన్నట్లు తనకు చూపించేదని చెప్పారు. సైబర్ సెల్ నుంచి ఓ పోలీస్ టీం ఫేక్ అకౌంట్లలో ఇంద్రాణి రోల్ పైన పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications