CAA: పౌరసత్వం కోసం దరఖాస్తు ఎలా ?..అర్హత, పత్రాలు, ఇతర వివరాలు..!
ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదించిన 2019 పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం పొరుగుదేశాలైన పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లోని ముస్లింలు మినహా ఇతర మైనార్టీలకు పౌరసత్వాన్ని ఇచ్చేందుకు వీలుగా కేంద్రం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు అర్హులు, ఏయే పత్రాలు సమర్పించాలన్న దానిపై కేంద్రం వివరాలు వెల్లడించింది.
సీఏఏ చట్టం ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లోని ఆరు మైనారిటీ కమ్యూనిటీల సభ్యులకు పౌరసత్వం పొందేందుకు అనుమతి ఇచ్చారు. ఏళ్ల తరబడి అణచివేతకు గురైన ఈ మైనారిటీలకు సరైన పునరావాసం కల్పించడం ఈ చట్టం లక్ష్యం అని ప్రభుత్వం చెబుతోంది. డిసెంబర్ 31, 2014కి ముందు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన ఆరు మతపరమైన మైనారిటీలకు చెందిన వ్యక్తులు హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ , క్రిస్టియన్ పౌరసత్వం పొందేందుకు అర్హులుగా ప్రకటించారు.

సీఏఏ ప్రకారం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా దరఖాస్తుదారులు సెక్షన్ 6B కింద రిజిస్ట్రేషన్ లేదా నేచురలైజేషన్ కోసం ఆన్ లైన్ లో ఓ దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం సూచించిన జిల్లా స్థాయి కమిటీ ద్వారా సాధికార కమిటీకి సమర్పించాలి. అప్లికేషన్‌ను సమర్పించాక ఫారమ్ 9లో ఓ ఎలక్ట్రానిక్ రసీదు ఇస్తారు. అనంతరం జిల్లా స్థాయి కమిటీ దరఖాస్తుతో పాటు దరఖాస్తుదారు సమర్పించిన పత్రాలను ధృవీకరించాలి.
పౌరసత్వ చట్టం ప్రకారం నియమించిన ప్రత్యేక అధికారి రెండవ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా దరఖాస్తుదారునికి విధేయత ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత విధేయత ప్రమాణంపై సంతకం చేసి దానికి సంబంధించిన ధృవీకరణతో పాటు ఎలక్ట్రానిక్ రూపంలో పత్రాలు పంపాలి. తగినన్ని అవకాశాలు ఇచ్చినా దరఖాస్తుదారుడు ఈ ప్రమాణానికి హాజరుకావడంలో విఫలమైతే జిల్లా స్ధాయి కమిటీ సదరు దరఖాస్తును తిరస్కరిస్తుంది.
సాధికారిక కమిటీ దరఖాస్తుదారుని విచారణ తర్వాత సంతృప్తి చెందితే, అతను సరైన వ్యక్తి అని , కేసు నమోదు చేయడానికి లేదా సహజంగా ఉండటానికి దరఖాస్తుదారు యొక్క అనుకూలతను నిర్ధారించడానికి అవసరమైనదిగా భావించినట్లయితే భారత పౌరసత్వాన్ని మంజూరు చేయవచ్చు. అంతేకాకుండా సీఏఏ నిబంధనలలోని సెక్షన్ 6Bలో ఉన్నవి కాకుండా ఇతర రెండు అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో మొదటిది దరఖాస్తులో చేసిన స్టేట్‌మెంట్‌ల యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించే అఫిడవిట్. అలాగే దరఖాస్తుదారు యొక్క స్వభావాన్ని నిరూపించే భారతీయ పౌరుడి అఫిడవిట్. రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో పేర్కొన్న భాషల్లో ఒకదానిపై తనకు తగిన పరిజ్ఞానం ఉందని దరఖాస్తుదారు అఫిడవిట్ ఇవ్వాలి.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
ట్రంప్‌కు తలనొప్పి.. పుతిన్‌కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications