అన్నకు రాఖీ కట్టాలని భార్య రూ. 10 అడిగింది, దేశానికి నష్టం లేదని భర్త అన్నాడు, చివరికి ?

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: అన్నకు రాఖీ కట్టాలని, రూ. 10 ఇవ్వాలని భర్తను భార్య అడిగింది. మీ అన్నకు రాఖీ కట్టకపోతే దేశానికి ఏమీ నష్టం లేదని భర్త చెప్పాడు. అన్నకు రాఖీ కట్టలేని ఈ జీవితం ఎందుకు అంటూ ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా మలప్రభ పట్టణంలో జరిగింది.

మలప్రభ పట్టణంలోని శహాపుర ప్రాంతలో అశోక్, మహదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. సోమవారం రాఖీ పండుగ సందర్బంగా తన అన్నకు రాఖీ కట్టాలని, రూ. 10 ఇవ్వాలని మహాదేవి ఆమె భర్త అశోక్ ను అడిగింది. రూ. 10 ఇవ్వడానికి అశోక్ నిరాకరించాడు.

Husband refuses to give Rs 10 to buy rakhi belagavi woman commit suicide in Karnataka

రూ. 10 ఇవ్వడానికి నిరాకరించిన అశోక్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అన్నకు రాఖీ కట్టడానికి తన భర్త రూ. 10 ఇవ్వలేదని, తన సోదరుడు ఎమనుకుంటాడని మహాదేవి కుమిలిపోయింది. తన అన్నకు ఫోన్ చేసిన మహాదేవి జరిగిన విషయం చెప్పింది. ఆమె సోదరుడు పర్వాలేదు మంగళవారం నేను ఇంటికి రాఖీ తీసుకుని వస్తానని చెప్పాడు.

Husband Brutally Killed his Wife in Nellore District - Oneindia Telugu

అయితే సోమవారం రాత్రి మహాదేవి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం మహాదేవి ఆత్మహత్య చేసుకుందనే విషయం గుర్తించిన ఆమె భర్త అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman in Shahapur village near Malaprabha Nagar, Belagavi committed suicide for a silly reason that her husband had not given money to her to purchase Rakhi. The incident took place yesterday(Aug 7th) night.
Please Wait while comments are loading...