భార్య తనతో రాలేదని నిప్పంటించుకున్నాడు
లక్నో: చిన్న విషయంలో భార్య మీద గొడవపడిన భర్త ఆవేశంలో నిప్పంటించుకుని ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సంఘటన ఉత్తరప్రదేశ్ లోని డోరియా జిల్లాలో జరిగింది. మంటలలో కాలిపోవడంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఉత్తరప్రదేశ్ లో గ్రామ్ ప్రధాన్ ఎన్నికల పొలింగ్ జరుగుతున్నది. మహేంద్ర చౌహాన్ అనే వ్యక్తి ఓటు వెయ్యడానికి తనతో పాటు రావాలని భార్యకు చెప్పాడు. అయితే భర్తతో వెల్లడానికి ఆమె నిరాకరించింది.

మహేంద్ర చౌహాన్ పోలింగ్ కేంద్రం దగ్గరకు వెళ్లాడు. తరువాత అతని భార్య పక్కింటి మహిళతో కలిసి పోలింగ్ కేంద్రం దగ్గరకు వెళ్లింది. అంతే విషయం గుర్తించిన మహేంద్ర చౌహాన్ ఆవేశం తట్టుకోలేక అందరి ముందు భార్యను భూతులు తిట్టాడు.
పోలింగ్ కేంద్రం దగ్గరే ఆమెను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు చితకబాదేశాడు. అక్కడ ఉన్న పెద్దమనుషులు ఇద్దరికి నచ్చ చెప్పి ఇంటికి పంపించారు. అయితే ఇంటికి వెళ్లిన మహేంద్ర చౌహాన్ అవమానం జరిగిందని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతను దాదాపు 50 శాతం కాలిపోయాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications