భార్య ల్యాప్ టాప్ ఓపెన్ చేశాడు.. ఆగ్రహంతో హత్యకు ప్లాన్..

Subscribe to Oneindia Telugu

గుజరాత్ : వయసు రీత్యా తన భార్యకు, తనకు మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం ఉండడంతో.. 'భార్య మరెవరితోనైనా..!' అన్న అనుమానం పెంచుకున్నాడు గుజరాత్ కు చెందిన హేమరాజ్ అనే భర్త. అదే అనుమానంతో భార్యకు తెలియకుండా ఆమె ల్యాప్ టాప్ ను తీసుకెళ్లి సీక్రెట్ గా ఓపెన్ చేశాడు. అందులో ఏం కనిపించిందో ఏమో తెలియదు గానీ ఆ తర్వాత ఆమెను చంపేయడానికే ప్లాన్ వేశాడు.

గుజరాత్ లోని వెజల్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. వెజల్ పూర్ కు చెందిన 51 ఏళ్ల హేమరాజ్ అనే ఆర్కిటెక్ కు ఇద్దరు భార్యలు ఉన్నారు. అందులో రెండో భార్య కెయురి వయసు 31 ఏళ్లు మాత్రమే. ఇద్దరికీ ఏడు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. పల్టీలోని చంద్రానగర్ లో ఉన్న పనామా సొసైటీలో వీరు కాపురముంటున్నారు. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోన్న కెయురి గత రెండు నెలల నుంచి భర్త వ్యాపార వ్యవహారాల్లోను సహాయపడుతూ వస్తోంది.

 A Husband tried for Murder His second wife in vejalpur

అయితే భార్య మీద అనుమానంతో శుక్రవారం నాడు ఆమెకు తెలియకుండా ఆమె ల్యాప్ టాప్ ను తీసుకుని గాంధీనగర్ ప్రాంతానికి వెళ్లాడు భర్త. దీంతో వెనకాలె భర్తను వెతుక్కుంటూ వెళ్లింది భార్య కెయురి. ఆ ల్యాప్ టాప్ లో ఏం కనిపించిందో ఏమోగానీ..! భార్య కెయురి, భర్త హేమరాజ్ వెళ్లిన బిల్డింగ్ కు వెళ్లగానే, పార్కింగ్ స్థలంలో ఉన్న ఆమెను కారుతో గుద్ది చంపబోయాడు భర్త హేమరాజ్.

భార్యను చంపాలనుకున్న హేమరాజ్ ప్రయత్నం విఫలం కాగా, కాలికి స్వల్ప గాయంతో భర్త దాడి నుంచి తప్పించుకోగలిగింది భార్య కెయురి. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు హేమరాజ్ ను అదుపులోకి తీసుకోగా.. భార్యపై అనుమానం ఉందని. అందుకే హత్యాయత్నం చేశానని పోలీసుల ముందు అసలు విషయం అంగీకరించాడు హేమరాజ్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Husband Hemaraj (51) tried for Murder His second wife Keyuri(31) in vejalpur. He taken her laptop with out her permission then after he tried to kill her

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి