హుందాయ్ పాకిస్థాన్ వివాదం: దక్షిణ కొరియాకు సమన్లు, విదేశాంగ మంత్రికి ఫోన్, విచారం

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ పాకిస్థాన్ వివాదంలో చిక్కుకుంది. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు సపోర్ట్ చేసిన పోస్టు తీవ్ర దుమారాన్ని రేపింది. హ్యుందాయ్ పాకిస్థాన్ పోస్టుకు వ్యతిరేకంగా భారత్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం (Kashmir Solidarity Day) సందర్భంగా హ్యుందాయ్ పాకిస్థాన్ పోస్ట్‌ చేయడం ఆందోళనకు దారితీసింది.

అంతేగాక, ఈ వ్యవహారంలో దక్షిణ కొరియా రాయబారికి సమన్లు జారీ చేసినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 5న హ్యుందాయ్ పాకిస్థాన్.. కాశ్మీర్‌కు సంబంధించి సోషల్ మీడియా పోస్ట్‌ పెట్టింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రిత్వ శాఖ రాయబారిని కోరింది. సియోల్‌లోని భారత రాయబారి శ్రీప్రియ రంగనాథన్ కూడా హ్యుందాయ్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ వివాదాస్పద పోస్టుపై హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తక్షణమే భారత్‌కు క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద సంఖ్యలో నెటిజన్లు, పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. #BoycottHyundai అంటూ ట్విట్టర్ ట్రెండ్ చేస్తున్నారు.

 Hyundai Pakistan row: South Korean foreign minister calls up EAM Jaishankar, says ‘regret the offence’

కాగా, భారత ప్రజలను ఇబ్బందులకు గురిచేసినందుకుగానూ చింతిస్తున్నట్లు హుందాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, తాజాగా ఈ వివాదంపై ఆ కంపెనీ సొంత దేశమైన దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి.. భారత విదేశాంగ మంత్రితో మాట్లాడి విచారం వ్యక్తం చేసినట్లు తెలిపినట్లు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ తెలిపారు. మరోవైపు, ఈ వ్యవహారంలో భారత్‌లోని దక్షిణ కొరియా రాయబారికి సమన్లు జారీ అయ్యాయి.

హ్యుందాయ్ పాకిస్థాన్ పేరుతో ఉన్న ఖాతాలో కాశ్మీర్ ను ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్ మా దృష్టికి వచ్చింది. ఆ పోస్టును చూసిన వెంటనే గత ఆదివారం దక్షిణకొరియా రాజధాని సియోల్ లోని మన రాయబారి హుందాయ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి వివరణ కోరారు. ఆ తర్వాత కొద్ది సేపట్లోనే సోషల్ మీడియా నుంచి ఆ పోస్టును డిలీట్ చేయించారు. సోమవారం రిపబ్లిక్ ఆఫ్ కొరియా భారత రాయబారికి కూడా కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంపై దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయ్ యాంగ్.. భార త విదేశాంగ మంత్రి జైశంకర్ తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడినట్లు బాగ్చీ తెలిపారు. వివిధ విషయాలతోపాటు హుందాయ్ అంశం కూడా వీరి చర్చలో వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+