నేను ఎవ్వరినీ రేప్ చెయ్యలేదు, ఎవరి చీరలు లాగలేదే ?, ఇది మాజీ డిప్యూటీ సీఎం తీరు !
బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇవ్వకపోవడంతో ఆ పార్టీ రెబల్స్ ఎక్కువ అయ్యారు. నేను ఏమైనా ఎవరినైనా రేప్ చేశానా ?, ఎవరి చీరలైనా లాగేశానా, ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి లాక్కొన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా అవమానించారని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ సవది మండిపడ్డారు.
గురువారం బెళగావి జిల్లాలోని అథణిలో మాజ ఉప ముఖ్యమంత్రి లక్షణ సవది మీడియాతో మాట్లాడుతూ బీజేపీలోకి కొందరు నాయకుల మీద మండిపడ్డారు. బీజేపీలో తనను కొందరు మానసికంగా హింసించారని లక్ష్మణ సవది ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా ఆ పదవి నుంచి కిందకు దించేశారని లక్ష్మణ సవది ఆరోపించారు.

ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని తనకు చెప్పిఉంటే సంతోషంగా రాజీనామా చేసి ఉండేవాడినని, అలా చెయ్యకండా తనను పదవి నుంచి తప్పించి అవమానించారని, అంత జరిగినా తాను ఎవరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది విచారం వ్యక్తం చేశారు.
ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి పీకేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా అవమానించారని లక్ష్మణ సవది మండిపడ్డారు. బీఎల్. సంతోష్ తన గురువు అని, ఆయన గురువారం ఉదయం నుంచి నాలుగు సార్లు తనకు ఫోన్ చేశారని, ఆవేశంలో ఉన్న తాను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే తన గురువు బాధపడుతారని తాను ఫోన్ రిసీవ్ చెయ్యలేదని లక్ష్మణ సవది మీడియాకు చెప్పారు.

ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదని మాత్రమే తాను బీజేపీకి రాజీనామా చెయ్యడం లేదని. ఆ పార్టీలోని కొందరు తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని, తన అభిమానం చంపుకోలేక తాను బీజేపీలో నుంచి బయటకు వెళ్లిపోతున్నానని లక్ష్మణ సవది చెప్పారు. శుక్రవారం బెంగళూరు వెళ్లి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తరువాత తాను ఏం చెయ్యాలో అది చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది ఆవేశంతో చెప్పారు.












Click it and Unblock the Notifications