వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను రాజీనామా చేయలేదు.. అవి కేవలం పుకార్లే అన్న హర్యానా బీజేపీ చీఫ్ బరాలా

|
Google Oneindia TeluguNews

హర్యానా: హర్యానా బీజేపీ చీఫ్ పదవికి తాను రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని చెప్పారు సుభాష్ బరాలా. ఆ వార్తలను ఖండించిన ఆయన అవి పుకార్లు మాత్రమే అని కొట్టిపారేశారు. హర్యానాలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. కానీ అంచనాలు ట్రాక్ తప్పాయి. హర్యానాలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోతుందనేది ట్రెండ్స్‌ను చూస్తే అర్థమవుతోంది. ఈ క్రమంలోనే హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా బీజేపీ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నారనే వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. ఈ వార్తలను ఆయన ఖండించారు. అవి కేవలం పుకార్లు అని కొట్టిపారేశారు.

ఇక తొహానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వయంగా పోటీచేసిన సుభాష్ బరాలా విజయావకాశాలు దాదాపు సన్నగిల్లిపోయాయి. ఫతేహాబాద్ జిల్లాలోని తొహానా నుంచి ఆయన బరిలో నిల్చున్నారు. కడపటి వార్తలు అందేసరికి తన సమీప ప్రత్యర్థి జన్‌నాయక్ జనతా పార్టీకి చెందిన దేవేందర్ సింగ్ బబ్లీ పై 20వేల ఓట్లతో వెనకంజలో ఉన్నారు.ఇదిలా ఉంటే హర్యానాలో హంగ్ అసెంబ్లీ తప్పదనే ట్రెండ్స్ చెబుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పలేదు. ఇక జేజేపీ పార్టీ 10 స్థానాల్లో లీడింగ్‌లో ఉంటూ సత్తా చాటుతోంది. అంతేకాదు కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశాలున్నాయి.

I did not resign, News is false: Haryana BJP chief Barala

బీజేపీకి ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేందుకు కారణం హర్యానాలో తగ్గిన పోలింగ్ శాతమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019 హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పడిపోయి 68.47శాతమే జరిగింది. ఇప్పుడు ఇదే బీజేపీ కొంప ముంచింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే బీజేపీ కాంగ్రెస్‌ల మధ్య చాలా దగ్గరగా పోటీ నెలకొంది. ఇక ఈ ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే పోలింగ్ శాతం భారీగా ఉన్నింది. దీంతో ఫలితాలు కూడా ముందుగా ఊహించినట్లుగానే వచ్చాయి. స్పష్టమైన మెజార్టీతో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాయి.

English summary
Haryana BJP chief Subash Barala clarified that he had not resigned to his post amid the Haryana Assembly elections. Barala said that the news was just a rumour
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X