వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం జరిగిందో అందరికీ తెలుసు: ప్రత్యూష బెనర్జీ ఫ్రెండ్ కామ్యా

తన స్నేహితురాలు, నటి ప్రత్యూష బెనర్జీ కేసు విషయంలో తాను చివరి వరకు పోరాటం చేస్తానని నటి కామ్యా పంజాబీ అన్నారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకొని ఏడాది అయింది.

|
Google Oneindia TeluguNews

ముంబై: తన స్నేహితురాలు, నటి ప్రత్యూష బెనర్జీ కేసు విషయంలో తాను చివరి వరకు పోరాటం చేస్తానని నటి కామ్యా పంజాబీ అన్నారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకొని ఏడాది అయింది. ఈ సందర్భంగా ఆమె చివరిగా నటించిన షార్ట్ ఫిలింను శనివారం విడుదల చేస్తున్నట్లు కామ్యా తెలిపారు.

ప్రత్యూష నిజ జీవితం, రీల్‌ జీవితం నేపథ్యంలో ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించారు. తాజాగా కామ్యా విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది తాను ఆమె కోసం పోరాడానని, ఇవాళ కూడా అదే చేస్తున్నానని, న్యాయం జరిగే వరకూ దీన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.

pratyusha banerjee

ప్రత్యూష ఆత్మహత్యకు ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్ సింగ్‌ కారణమని ఆరోపిస్తూ అతడిపై కేసు విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.
అయితే ప్రత్యూష వీడియోను విడుదల చేసినందుకు రాహుల్‌ రాజ్‌సింగ్‌ కామ్యాపై మరో కేసు పెట్టారు. ఆ వీడియోలో తనను చెడుగా చూపించారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ముంబై హైకోర్టు షార్ట్ ఫిలిం విడుదలపై స్టే విధించింది. కానీ షార్ట్ ఫిలిం విడుదల చేస్తానని కామ్యా ప్రకటించారు.

pratyusha banerjee

తాను ప్రత్యూష తల్లిదండ్రులతో టచ్‌లో ఉన్నానని, వాళ్ల కుమార్తెను వెనక్కు తీసుకురాలేనని, కానీ ఆమె బాధ్యతలను నిర్వర్తించగలనని, కాబట్టి వారి వెంటే ఉంటానని, ఈ షార్ట్ ఫిలిం వల్ల వాళ్లు గతంతో పోలిస్తే కాస్త బాగానే ఉన్నారని, ప్రత్యూష మరణం తర్వాత వాళ్ల జీవితాల్లో ఏర్పడిన లోటు, ఎప్పటికీ పరిపూర్ణం కాదన్నారు.

English summary
Last year on April 1, television industry lost one of its brightest stars, Pratyusha Banerjee, Anandi for most of us. But the loss was more personal for actor Kamya Punjabi, who was one of Pratyusha’s closest friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X