తమిళనాడు ప్రజలు నన్ను సీఎం చేస్తారు, కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా: కమల్ హాసన్!
చెన్నై: భారత సినీరంగంలో తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బహుబాష నటుడు కమల్ హాసన్ తాను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని దృవీకరించారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చూడాలని ఎదురు చూస్తున్నారని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రస్తుతం చీకటి, రిసార్ట్ రాజకీయాలు జరుగుతున్నాయని, వాటిని చూసి తమిళ ప్రజలు విరక్తి పెంచుకున్నారని చెప్పారు.

తాను వ్యాపారం చెయ్యడానికి రాజకీయాల్లోకి రావడంలేదని, ప్రజలకు సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి వస్తున్నానని కమల్ హాసన్ వివరించారు. ప్రస్తుతం తమిళనాడులో కుళ్లు రాజకీయాలు, రిసార్ట్ రాజకీయాలు జరుగుతున్నాయని, ప్రజల కష్టాల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కమల్ హాసన్ ఆరోపించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం చెన్నై చేరుకుని కమల్ హాసన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయిన తరువాత కమల్ హాసన్ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో సంచనల వ్యాఖ్యలు చేశారు.
తనను తమిళనాడు ప్రజలు కచ్చితంగా ముఖ్యమంత్రిని చేస్తారని కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లో రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని కమల్ హాసన్ మరో సారి చెప్పారు. కమల్ హాసన్ ఆప్ లో చేరుతారా ? లేక సొంత పార్టీ పెడుతారా ? అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications