ICU Bed: మత్తుమందు ఇచ్చి యవతి మీద రేప్, వార్డుబాయ్ అరాచకం, విషం ఇంజక్షన్ తో చంపేస్తా !
మీరట్/లక్నో/చెన్నై: కోవిడ్ లక్షణాలతో తీవ్రజ్వరంతో బాధపడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్న యువతి మీద అదే ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న కామాంధుడి కన్ను పడింది. ఐసీయూలో ఉన్న యువతికి మందులు ఇచ్చే నెపంతో వెళ్లి వస్తున్న ఆ వ్యక్తి యువతిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. అనారోగ్యంతో ఉన్న ఆ యువతి మొదట లైంగిక వేధింపుల విషయం కుటుంబ సభ్యులకు చెప్పలేకపోయింది. అర్దరాత్రి యువతికి మత్తుమందు కలిపిన ఇంజెక్షన్ వేసిన కామాంధుడు ఐసీయూ బెడ్ మీద ఆమె మీద అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే ఇదే ఐసీయూ బెడ్ మీద మరోసారి రేప్ చేసి నీకు విషం కలిపిన ఇంజక్షన్ వేసి చంపేస్తానని ఆమెను బెదిరించడం కలకలం రేపింది.

యువతికి కోవిడ్ లక్షణాలు
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో నివాసం ఉంటున్న 18 ఏళ్ల యువతికి జ్వరం ఎక్కువ రావడంతో ఆమెకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మూడు రోజులు అయినా ఆమెకు జ్వరం తగ్గకపోవడంతో మీరట్ లోని రిలారే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స చేసిన వైద్యులు యువతికి కోవిడ్ లక్షణాలు ఉన్నాయని చెప్పారు.

ఐసీయూలో చికిత్స
కోవిడ్ లక్షణాలతో తీవ్రజ్వరంతో బాధపడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్న యువతి మీద అదే ఆసుపత్రి వార్డు బాయ్ గా ఉద్యోగం చేస్తున్న ఖాసిమ్ అనే కామాంధుడి కన్ను పడింది. ఐసీయూలో ఉన్న యువతికి మందులు ఇచ్చే నెపంతో వెళ్లి వస్తున్న ఖాసిమ్ యువతిని లైంగిక వేధింపులకు గురి చేశాడు.

మత్తు ఇంజక్షన్ వేసి ఐసీయూ బెడ్ మీద రేప్
అనారోగ్యంతో ఉన్న ఆ యువతి మొదట లైంగిక వేధింపుల విషయం కుటుంబ సభ్యులకు చెప్పలేకపోయింది. అర్దరాత్రి ఐసీయూ వార్డులోకి వెళ్లిన ఖాసిమ్ ఆ యువతికి మత్తుమందు కలిపిన ఇంజెక్షన్ వేశాడు. వేకువ జామున 3 గంటల సమయంలో కామాంధుడు ఖాసీమ్ ఐసీయూ బెడ్ మీద ఆ యువతి మీద అత్యాచారం చేశాడని ఆ యువతి ఆరోపిస్తున్నది.

విషం ఇంజక్షన్ వేసి చంపేస్తా
అత్యాచారం చేసిన విషయం బయటకు చెబితే ఇదే ఐసీయూ బెడ్ మీద మరోసారి రేప్ చేసి నీకు విషం కలిపిన ఇంజక్షన్ వేసి చంపేస్తానని ఖాసిమ్ ఆమెను బెదిరించాడు. మరుసటి రోజు యువతి ఆమె అన్న భార్యకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. విషయం తెలుసుకున్న మీరట్ లోని లిసారే పోలీస్ స్టేషన్ అధికారులు ఆసుపత్రి చేరుకుని ఖాసీమ్ ను అరెస్టు చేశారు.

ఆసుపత్రిలో చాలాసార్లు ఖాసీమ్ ?
ఖార్జౌడాలోని హోసిపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న ఖాసీమ్ ఇంతకు ముందు కూడా ఆసుపత్రిలోని రోగులను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయని, అతన్ని విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మీరట్ ఆసుపత్రిలో ఐసీయూ వార్డులో కోవిడ్ రోగి మీద అత్యాచారం జరగడం ఉత్తర్ ప్రదేశ్ లో కలకలం రేపింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications