జియోకు పోటీగా.. ఐడియా నుంచి మరో సూపర్ ఆఫర్
జియోకు పోటీగా ఐడియా సెల్యులార్ కూడా శుక్రవారం ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 4జీ మొబైల్ యూజర్లకు రోజుకి 1జీబీ చొప్పున 4జీ డేటాను అందించనుంది.
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఫీవర్ ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. దేశీయ టెలికాం కంపెనీలు జియో బారినుంచి తమను తాము కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి.
తాజాగా ఐడియా సెల్యులార్ శుక్రవారం ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్ పరిచయం చేసింది. దీని ప్రకారం 4జీ మొబైల్ యూజర్లకు రోజుకి 1జీబీ చొప్పున 4జీ డేటాను అందించనుంది.

లిమిటెడ్ రెంటెడ్ ప్లాన్స్ లో ప్రీ పెయిడ్ యూజర్లందరికీ ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. కొత్త ఐడియా ప్యాక్స్ రూ.199 నుంచి మొదలవుతాయి. ఈ కొత్త పథకం ప్రకారం.. రూ.499 ఆపైన ప్లాన్ లో రూ.300 విలువైన డేటా సేవలు ఉచితమని కంపెనీ చెబుతోంది.
ఐడియా సమాచారం ప్రకారం రూ.349-రూ.498 మధ్య రెంటల్ ప్లాన్ లో రూ.50 డిస్కౌంట్, అలాగే రూ.149-రూ.349 మధ్య రెంటల్ ప్లాన్ లో ఖాతాదారులకు రూ.100 డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది.
రూ.300 యాడ్ ఆన్ ప్యాక్ తో రోజుకు 1 జీబీ చొప్పున నెల రోజుల పాటు 4జీ డేటాను అందించనుంది. రూ.349 లేదా అంతకంటే ఎక్కువ రెంటల్ ఉన్న పోస్ట్ పెయిడ్ కస్టమర్లు రూ.50 అదనంగా చెల్లించి మూడు నెలల పాటు ఈ ఆఫర్ ను పొందొచ్చని ఐడియా స్పష్టం చేసింది.
మూడు నెలల తరువాత కూడా మార్చి 2018 వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ ను పొందాలంటే రూ.199-రూ.349 మధ్య ప్లాన్ లో అదనంగా రూ.200, రూ.349-రూ.498 మధ్య ప్లాన్ లో అదనంగా రూ.50 చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. ఈ ప్లాన్స్ నమోదు ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం 4జీ హ్యాండ్ సెట్లు వినియోగించే యూజర్లకు మాత్రమే.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications