గాంధీని గాడ్సే చంపకపోయుంటే నేనే చంపేదాన్ని: పూజా శకున్ పాండే వివాదాస్పదం
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త పూజా శకున్ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీని గాడ్సే చంపకుంటే.. తానే చంపేదాన్నంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్ఎం) ఆధ్వర్యంలో దేశంలోనే తొలి హిందూ కోర్టును ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు.
ఆ కోర్టుకు పూజా శకున్ పాండేను జడ్జీగా నియమించారు. ఈ క్రమంలో పూజా శకున్ పాండే ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. గాంధీని నాథూరామ్ గాడ్సే చంపకుండా ఉండి.. ఆ సమయంలో తాను పుట్టివుంటే తానే గాంధీని చంపేదాన్నని అన్నారు.

'నేటికైనా సరే.. దేశాన్ని విభజించాలని భావించే గాంధీ ఒకరుంటే.. అడ్డుకునే గాడ్సే ఒకరుంటారు. నాథూరామ్ గాడ్సేను నేను ఆరాధిస్తానని చెప్పడానికి గర్విస్తాను' అని పూజ వ్యాఖ్యానించారు.
'గాంధీని గాడ్సే చంపలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేలోపే అతడిని శిక్షించారు. అందరూ అసలు చరిత్ర చదవాలి' అని ఆమె అన్నారు. గతంలో కూడా పూజ.. ట్రిపుల్ తలాక్ పేరుతో మోసపోయిన ముస్లిం మహిళలు హిందూ ధర్మాన్ని అనుసరించాలంటూ వ్యాఖ్యానించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications