Reddy: నన్ను అర్థం చేసుకోండి, నేను చెప్పినట్లు చెయ్యండి, రైతులకు బంపర్ ఆఫర్, గాలి జనార్దన్ రెడ్డి !
బెంగళూరు/బళ్లారి: కళ్యాణ్ రాజ్య ప్రగతి పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో కేఆర్ పీపీ అభ్యర్థులను బరిలోకి దించనున్నారు. పలువురు నేతలు కేఆర్ పీ పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్నారు. తమ పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు తనను నేరుగా సంప్రధించకపోయినా నేను చెప్పినట్లు చేస్తే టిక్కెట్లు ఇచ్చే విషయం నేను స్వయంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటానని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు. కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్ధన్ రెడ్డి గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. గాలి జనార్దన్ రెడ్డి రైతులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

అభ్యర్థులను ప్రకటించిన రెడ్డి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటుకోవాలని కేఆర్ పీ పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే కోప్పళ, సిరుగుప్ప, కనకగిరి, సింధనూరు, హిరియూరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కేఆర్ పీ పార్టీ అభ్యర్థులను ప్రకటించి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులకు సవాలు విసిరారు. మా అభ్యర్థులు కచ్చితంగా గెలుస్తారని గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

అన్నీ ఆలోచించి ఇస్తున్నాము
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల గురించి అన్ని వివరాలు తెలుసుకుని టిక్కెట్లు ఇస్తున్నామని, వారు గెలుస్తారనే నమ్మకంతోనే అభ్యర్థులను ప్రకటిస్తున్నామని. ఏదో పోటీ చెయ్యాలంటే చెయ్యాలి అని కాకుండా కష్టపడి ఓటర్లను ఆకర్షించే నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు.

రైతులకు బంపర్ ఆఫర్
మేము అధికారంలోకి వస్తే రైతులకు ప్రతిఒక్కరి అకౌంట్ లో రూ. 15 వేలు జమ చేస్తామని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. కేఆర్ పీ పార్టీ మేనిఫేస్టోలో ఇప్పటి ఈ విషయాన్ని ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి ఎక్కువగా రైతన్నలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా ప్రజల్లో ఉండే నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్న గాలి జనార్దన్ రెడ్డి అన్నీ ఆలోచించి అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

నన్ను అర్థం చేసుకోండి.... ఈమెయిల్ చెయ్యిండి చాలు
ప్రతిరోజు గంగావతిలోని తన ఇంటి దగ్గర వేలాది మంది అభిమానులు, నాయకులు వస్తున్నారని, అందరితో ప్రత్యేకంగా మాట్లాడం సాధ్యం కావడం లేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తమ పార్టీ నుంచి పోటీ చెయ్యాలని అనుకుంటున్న నాయకులు తనను నేరుగా కలవకపోయినా పర్వాలేదని, దయచేసి నేను ఇచ్చే ఈమెయిల్ అడ్రస్ కు వారి వివరాలు పంపిస్తే తాను పరిశీలించి టిక్కెట్లు ఇస్తానని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు.

కేఆర్ పీ పార్టీ సత్తా చాటితే ?
ప్రతిరోజు చాలా మంది గంగావతికి వెళ్లి పార్టీ టిక్కెట్లు అడగడానికి ప్రయత్నించడంతో వారితో గాలి జనార్దన్ రెడ్డి తీరికగా మాట్లాడలేకపోతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ ఏం చేస్తుందో వేచి చూడాలని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే కొన్ని సీట్లు అయినా గెలుచుకుని కర్ణాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ కావాలని గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications