ఐఐటీ మద్రాసులో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య
హైదరాబాద్: చెన్నైలోని ఐఐటీ మద్రాసులో ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధి బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) విభాగంలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
పోలీసులు కథనం ప్రకారం రాహుల్ జి. ప్రసాద్ అనే విద్యార్ధి గంగ హాస్టల్‌లోని మూడవ అంతస్తులోని తన గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. విద్యార్ధి స్వస్థలం కేరళలోని కొల్లాం. 2012లో ఐఐటీ మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో చేరాడు.

సోమవారం ఉదయం హాస్టల్‌లోని తన గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్న మృతదేహాన్ని చూసిన స్నేహితులు హాస్టల్ వార్డెన్‌కు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థి ఉరి వేసుకున్న హాస్టల్ గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు.
మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కడప జిల్లాకు చెందిన నాగేంద్ర రెడ్డి(23) అనే ఎంటెక్ విద్యార్థి కూడా తాంబ్రపరాని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
Kollam, #Kerala-native found hanging inside his hostel room at the IIT-Madras #suicide
— Rajesh Abraham (@pendown) October 19, 2015 











Click it and Unblock the Notifications