Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: పాత ప్రియుడి మీద మోజు తీరిపోయింది, కొత్త ప్రియుడు ఎంట్రీ, ఫినిష్ !

చెన్నై/ కడలూరు: పెద్దలు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో బుద్దిగా కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. కొడుక్కి 17 ఏళ్లు, కూతురికి 15 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు చదువుకుంటున్నారు. భర్త వ్యాపారం పని మీద ఎక్కువగా బయట తిరుగుతున్నాడు .ఇదే సమయంలో సొంత ఊరిలో నివాసం ఉంటున్న వ్యక్తితో పరిచయం పెంచుకున్న ఆమె అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో తిరిగింది. భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటున్న మహిళ అతనితో ఆమె కోరికలు తీర్చుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి ఆమె రహస్య ప్రాంతాలకు వెళ్లి వస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రియుడు కాకుండా మరో యువకుడితో ఆమె ఎక్కువ చనువు పెంచుకుంది. పాత ప్రియుడిని పక్కన పెట్టిన కిలాడీ లేడి ఆమె కొత్త ప్రియుడితో తిరగడం మొదలు పెట్టింది. విషయం తెలుసుకున్న పాత ప్రియుడు మద్యం సేవించి ఆమె ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. తనతో పాటు ఇప్పుడు తాను పిలిచిన చోటకు వచ్చి తనకు పడక సుఖం ఇవ్వాలని ఆమె మీద ఒత్తిడి చేశాడు. పాత ప్రియుడు పిలిచిన చోటకు వెళ్లడానికి ఆమె నిరాకరించింది. ఆ సమయంలో గొడవ జరగడంతో ఇంట్లో ఉన్న పెద్ద కర్ర తీసుకుని ప్రియుడి తల మీద దాడి చెయ్యడంతో అతని ప్రాణం పోయింది. కొత్త ప్రియుడికి ఫోన్ చేసిన కిలాడీ లేడి అతన్ని ఇంటికి పిలిపించుకుని పాత ప్రియుడి శవాన్ని తీసుకెళ్లి స్కూల్ ఆవరణంలో విసిరేసి చేతులు దులుపుకోవడం కలకలం రేపింది.

 మొదట్లో బుద్దిగా కాపురం చేసింది

మొదట్లో బుద్దిగా కాపురం చేసింది

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని సేతియాతోప్పు గ్రాయంలో శివకుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 సంవత్సరాల క్రితం శివకుమార్ మహాలక్ష్మి (40) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెద్దలు చూపించిన శివకుమార్ ను వివాహం చేసుకున్న మహాలక్ష్మి ఆమె భర్తతో బుద్దిగా కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది.

 ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

శివకుమార్, మహాలక్ష్మి దంపతుల కొడుక్కి 17 ఏళ్లు, కూతురికి 15 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఉన్నారు. మహాలక్ష్మి ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. మహాలక్ష్మి భర్త శివకుమార్ వ్యాపారం పని మీద ఎక్కువగా బయట ఊర్లు తిరుగుతున్నాడు .ఇదే సమయంలో సొంత ఊరిలో నివాసం ఉంటున్న వేలుమురుగన్ (50) అనే వ్యక్తితో మహాలక్ష్మి పరిచయం పెంచుకుని అతని వలలో పడిపోయింది.

 ప్రియుడితో భార్య జల్సాలు

ప్రియుడితో భార్య జల్సాలు

భర్త శివకుమార్ కళ్లు కప్పిన అతని భార్య మహాలక్ష్మి ఆమె ప్రియుడు వేలుమురుగన్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో తిరిగింది. భర్త శివకుమార్, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ప్రియుడు వేలుమురుగన్ ను ఇంటికి పిలిపించుకుంటున్న మహాలక్ష్మి అతనితో ఆమె కోరికలు తీర్చుకుంది. భర్త శివకుమార్ ఊర్లో లేని సమయంలో ప్రియుడు వేలుమురుగన్ తో కలిసి మహాలక్ష్మి రహస్య ప్రాంతాలకు వెళ్లి వస్తోంది.

 కొత్త ప్రియుడిని సెట్ చేసుకుంది

కొత్త ప్రియుడిని సెట్ చేసుకుంది

గత ఏడాది మహాలక్ష్మికి రామచంద్రన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను మహాలక్ష్మి పాత ప్రియుడు వేలుమురుగన్ మీద మోజు తీరిపోయి కొత్త ప్రియుడు రామచంద్రన్ కు దగ్గర కావడం మొదలుపెట్టింది. పాత ప్రియుడు వేలుమురుగన్ ను పూర్తిగా పక్కన పెట్టిన కిలాడీ లేడి మహాలక్ష్మి ఆమె కొత్త ప్రియుడు రామచంద్రన్ తో తిరగడం మొదలు పెట్టింది.

 మద్యం సేవించి వెళ్లిన పాత ప్రియుడు

మద్యం సేవించి వెళ్లిన పాత ప్రియుడు

తన ప్రియురాలు మహాలక్ష్మి కొత్తగా రామచంద్రన్ అనే వ్యక్తితో తిరుగుతోందని వేలుమురుగన్ కు తెలిసిపోయింది. పక్కా సమాచారం తెలుసుకున్న పాత ప్రియుడు వేలుమురుగన్ మద్యం సేవించి ప్రియురాలు మహాలక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మహాలక్ష్మి భర్త శివకుమార్, ఆమె ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లడంతో ప్రియుడు వేలుమురుగన్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు.

 ప్రియురాలి చేతిలో ప్రాణం పోయింది

ప్రియురాలి చేతిలో ప్రాణం పోయింది

వేలుమురుగన్ వెళ్లిన సమయంలో మహాలక్ష్మి ఆమె కొత్త ప్రియుడు రామచంద్రన్ తో ఫోన్ లో మాట్లాడుతుండటంతో అక్కడ గొడవ ఎక్కువ అయ్యింది. ఇప్పుడు తనతో పాటు తాను పిలిచిన చోటకు వచ్చి తనకు పడక సుఖం ఇవ్వాలని వేలుమురుగన్ అతని ప్రియురాలు మహాలక్ష్మి మీద ఒత్తిడి చేశాడు. పాత ప్రియుడు వేలుమురుగన్ పిలిచిన చోటకు వెళ్లడానికి మహాలక్ష్మి నిరాకరించింది. ఆమె నిరాకరించింది. ఆ సమయంలో గొడవ జరగడంతో ఇంట్లో ఉన్న పెద్ద కర్ర తీసుకున్న మహాలక్ష్మి ఆమె పాత ప్రియుడు వేలుమురుగన్ తల మీద దాడి చేసి కత్తితో అతన్ని పొడవడంతో అతని ప్రాణం పోయింది.

 శవం మాయం చేసిన కొత్త ప్రియుడు

శవం మాయం చేసిన కొత్త ప్రియుడు

వేలుమురుగన్ ప్రాణం పోయిందని తెలుసుకున్న మహాలక్ష్మి హడలిపోయింది. కొత్త ప్రియుడు రామచంద్రన్ కు ఫోన్ చేసిన కిలాడీ లేడి మహాలక్ష్మి అతన్ని ఇంటికి పిలిపించుకుని అతనితో కలిసి పాత ప్రియుడు వేలుమురుగన్ శవాన్ని తీసుకెళ్లి పంచాయితీ స్కూల్ ఆవరణంలో విసిరేసి చేతులు దులుపుకోనింది. మరుసటి రోజు వేలుమురుగన్ శవం గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు

Recommended Video

    తన ఇంటిపై దాడిన అడ్డుకున్న కార్యకర్తలపై అక్రమకేసులు ఎత్తేయాలన్న రేవంత్ రెడ్డి!!
     కర్రతో కొట్టి కత్తితో పొడిచి చంపేశారు

    కర్రతో కొట్టి కత్తితో పొడిచి చంపేశారు

    తల మీద బలంగా దాడి చేసి కత్తితో పొడవం వలనే వేలుమురుగన్ ప్రాణం పోయిందని పోలీసులు గుర్తించారు. వేలుమురుగన్ మొబైల్ ఫోన్ లో ఎక్కువగా మహాలక్ష్మికి ఫోన్లు చేసిన విషయం గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మహాలక్ష్మి, ఆమె ప్రియుడు రామచంద్రన్ కలిసి వేలుమురుగన్ ను హత్య చేశారని అంగీకరించడంతో ఇద్దరిని అరెస్టు చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+