Aunty : ప్రియురాలి మోజులో అంకుల్, కొడుకుతో కలిసి ఆంటీని చంపేసి ?, కూతురి దెబ్బతో సీన్ రివర్స్ !

బెంగళూరు/హాసన్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటిలో ఉంటున్నది. కొడుకు పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు నివాసం ఉంటున్న భవనంలోనే మరో ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఒకే బిల్డింగ్ లో రెండు పోర్షన్లలో తల్లిదండ్రులు, వాళ్ల కొడుకు, కోడలు నివాసం ఉంటున్నారు. భర్తకు కత్తిలాంటి ఓ ప్రియురాలు ఉంది. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్త అతని భార్యను పట్టించుకోవడం లేదు. ప్రియురాలు మోజులో పడిపోయిన అతను ఆమెతో పిచ్చపాటిగా జల్సా చేస్తున్నాడు. తన తల్లిని తన తండ్రి, సోదరుడు చంపేశారని కూతురు కేసు పెట్టడంతో అక్కడ కథ రసవత్తరంగా మారిపోయింది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని చెన్నరాయపట్టణ తాలుకాలోని మరనహళ్ళిలో మంజునాథ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 ఏళ్ల క్రితం మంజునాథ్ సుశీలమ్మ (50) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మంజునాథ్, సుశీలమ్మ దంపతులకు మనోజ్ అనే కొడుకు, నీరూపా (పేరు మార్చడం జరిగింది) అనే కూతురు ఉన్నారు. వివాహం చేసుకున్న తరువాత 20 సంవత్సరాల పాటు మంజునథ్ సుశీలమ్మ దంపతులు చాలా సంతోషంగా జీవించారు.

ఒకే బిల్డింగ్ లో తండ్రి కొడుకు వేర్వేరు కాపురాలు

ఒకే బిల్డింగ్ లో తండ్రి కొడుకు వేర్వేరు కాపురాలు

మంజునాథ్, సుశీలమ్మ దంపతుల కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటిలో ఉంటున్నది. మంజునాథ్, సుశీలమ్మ దంపతుల కొడుకు మనోజ్ పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు నివాసం ఉంటున్న భవనంలోనే మరో ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఒకే బిల్డింగ్ లో రెండు పోర్షన్లలో తల్లిదండ్రులు మంజునాథ్ సుశీలమ్మ, వాళ్ల కొడుకు మనోజ్, అతని భార్య నివాసం ఉంటున్నారు.

 ప్రియురాలితో తండ్రి జల్సాలు

ప్రియురాలితో తండ్రి జల్సాలు


మనోజ్ తండ్రి మంజునాథ్ కు కత్తిలాంటి ఓ ప్రియురాలు ఉంది. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న మంజునాథ్ అతని భార్య సుశీలమ్మను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం.. ఇదే విషయంలో భార్య సుశీలమ్మ ఆమె భర్త మంజునాథ్ తో గొడవపడుతోంది. బంధువులు ఇప్పటికే చాలాసార్లు పంచాయితీలు చేసినా మంజునాథ్ ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది.

ప్రియురాలి మోజులో భార్య మీద పగ

ప్రియురాలి మోజులో భార్య మీద పగ

తన సంతోషాలకు తన భార్య సుశీలమ్మ అడ్డుపుడుతోందని ఆమె భర్త మంజునాథ్ రగిలిపోయాడు. నా ప్రియురాలితో నేను సంతోషంగా ఉండాలంటే నా భార్య సుశీలమ్మను చంపేయాలని మంజునాథ్ స్కెచ్ వేశాడు. కొడుకు మనోజ్ కు మాయమాటలు చెప్పిన అతని తండ్రి మంజునాథ్ అతని భార్యను చంపేయాలని స్కెచ్ వేశాడు.

కొడుకుతో కలిసి భార్యను చంపేసిన భర్త

కొడుకుతో కలిసి భార్యను చంపేసిన భర్త

ఆదివారం ఇంట్లో అతని కొడుకు సహాయంతో కట్టుకున్న భార్య సుశీలమ్మ గొంతును టవల్ తో బిగించి సింపుల్ గా చంపేశాడు. తన తల్లి సుశీలమ్మను తన తండ్రి మంజునాథ్, సోదరుడు మనోజ్ చంపేశారని కూతురు కేసు పెట్టింది. పోలీసులు మంజునాథ్, అతని కొడుకు మనోజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+