Illegal affair: సినిమా స్టైల్లో హత్య, ఆంటీ అంటూనే ?, లెక్చరర్ కొడుకే కిల్లర్, బంధువే !
బెంగళూరు/హావేరి/చెన్నై: దృశ్యం సినిమా ఏ రైంజ్ లో సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ బాషాల్లో తెరకెక్కిన దృశ్యం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునింది. ఇదే దృశ్యం సినిమా టైపులో ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటకలో అనేక హత్యలు జరిగాయి. అక్రమ సంబంధం కారణంగా 11 ఏళ్ల బాలుడిని అచ్చం దృశ్యం సినిమా టైపులో దారుణంగా చంపేశారు. ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే హంతకుల ఆచూకి గురించి వాళ్ల తల్లే పోలీసులకు సమాచారం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆంటీ అంటూనే వాళ్ల అబ్బాయిని చంపేశారు. హంతకుడు లెక్చరర్ కొడుకు కావడం, చంపిది బంధువునే కావడం ఇప్పుడు కలకలం రేపింది.
Lady Teacher: పెళ్లాం టీచర్, పక్కింట్లో పులిహోరా కలిపిన పోలీసు, జీతం తీసుకుని జల్సా!

మల్లీశ్వరి కొడుకు మాయం
కర్ణాటకలోని హావేరి పట్టణంలోని అశ్వినీ నగర్ సమీపంలోని శివా పార్క్ ప్రాంతంలో జగదీశ్, మల్లీశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. జగదీశ్, మల్లీశ్వరి దంపతులకు తేజస్ గౌడ (11) అనే కుమారుడు ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా ఇంటి దగ్గరే ఉంటున్న తేజస్ గౌడ రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లి సాటి స్నేహితులతో ఆడుకుంటున్నాడు.

మద్యాహ్నం తేజస్ గౌడ మాయం
ఐదు రోజుల క్రితం మార్చి 7వ తేదీన మద్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు వెళ్లిన తేజస్ గౌడ తరువాత కనపడకుండా పోయాడు. కొడుకు కోసం అనేక ప్రాంతాల్లో గాలించిన జగదీశ్ చివరికి బంధువులు, తెలిసనవాళ్లకు ఫోన్ చేసి కొడుకు కోసం ఆరా తీశాడు. తేజస్ గౌడ ఆచూకి ఏమాత్రం చిక్కకపోవడంతో జగదీశ్ హావేరి నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నాలుగు రోజులకు శివరాత్రి రోజు డౌట్ ?
తేజస్ గౌడ మాయం అయిన నాలుగు రోజుల వరకు అతని ఆచూకి ఏమాత్రం పోలీసులకు చిక్కలేదు. ఇటు కుటుంబ సభ్యులు, అటు పోలీసులు తేజస్ గౌడ కోసం వెతికివెతికి విసిగిపోయారు. మార్చి 11వ తేది శివరాత్రి రోజు తేజస్ గౌడ తండ్రి జగదీశ్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన కొడుకు ఇంత వరకు కనపడలేదని, అతన్ని ఎవరో హత్య చేసి ఉంటారని మరోసారి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు షాక్ అయ్యారు.

పార్క్ పక్కనే తేజస్ శవం
తేజస్ తండ్రి రెండోసారి హత్య కేసు నమోదు చెయ్యడంతో పోలీసులు సీరియస్ గా గాలించారు. తేజస్ గౌడ నివాసం ఉంటున్న ప్రాంతంలోని శివా పార్క్ శివార్లలోని నిర్జనప్రదేశంలో అర్ధం కాలిపోయిన బాలుడి శవాన్ని శుక్రవారం వేకువ జామున (మార్చి 12వ తేది) గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యకు గురైయ్యింది తేజస్ గౌడ అని అతని తండ్రి జగదీశ్ దృవీకరించడంతో పోలీసులతో పాటు స్థానికులు షాక్ అయ్యారు.

దృశ్యం సినిమా స్టైల్లో దారుణ హత్య
తేజస్ గౌడ మాయం అయిన రోజు అతన్ని నమ్మించి కారులో కిడ్నాప్ చేశారు. కారులోనే తేజస్ గౌడ గొంతునులిమి అతని నోరు, ముక్కు మూసివేయడంతో కారులోనే ఆ అబ్బాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారులోనే చంపేసిన తరువాత తేజస్ శవాన్ని తీసుకెళ్లి చెరువులో విసిరేసి నీటిలో మునిగి చనిపోయాడని నమ్మించడానికి ప్రయత్నించారు. నీటిలో శవం తేలితే చిక్కిపోతామని హంతకులు భయపడ్డారు.

శవాన్ని ఏం చేశారంటే ?
చెరువలో పడేసిన తేజస్ గౌడ శవాన్ని మళ్లీ బయటకు తీశారు. అక్కడి నుంచి శవాన్ని కారులోకి తీసికెళ్లి మరో ప్రాంతంలో పూడ్చిపెట్టి కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. మళ్లీ శవం చిక్కితే సమస్యలు ఎదురౌతాయని భయపడిన నిందితులు పూడ్చిపెట్టిన శవాన్ని మళ్లీ బయటకు తీసి శివా పార్క్ సమీపంలోని నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి పెట్రోల్ సోసి, కారు టైర్లు వేసి నిప్పంటి కాల్చి భూడిద చెయ్యడానికి ప్రయత్నించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

క్లూ ఇచ్చిన తల్లి..... అక్రమ సంబంధమేనా ?
తేజస్ గౌడ హత్య కేసులో హావేరి ఇంజనీరింగ్ కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి కొడుకు రితేష్ మేటి (21) అనే యువకుడితో పాటు మరో మైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రితేష్ మేటి తల్లి సమాచారం ఇవ్వడంతోనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారని తెలిసింది. అయితే అరెస్టు అయిన యువకుడు ఓ లెక్సరర్ కొడుకు కావడం, ఈ కేసులోని హంతకుల్లో ఓ మైనర్ ఉండటం కలకలం రేపింది. అక్రమ సంబంధం కారణంగానే 11 ఏళ్ల తేజస్ హత్యకు గురైనాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఓ లెక్సరర్ కొడుకు ఓ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఎందుకు చంపేశాడు ? అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది.