భార్య ప్రియుడితో పారిపోయిందని, పిల్లలను కత్తితో పొడిచి, ఆత్మహత్యయత్నం చేసుకొన్నాడు
వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో చిచ్చురాజేసింది. సోమబహదూర్ చెట్రీ దినసరి కూలీగా పనిచేస్తాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఆయన భార్య వేరే వ్యక్తితో ఇంటినుండి పారిపోయింది.
జైగాం: వివాహేతర సంబంధం పచ్చని కుటుంబంలో చిచ్చు రాజేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఓ వివాహిత ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటనతో మనోవేదనకు గురైన ఆమె భర్త తన ఇద్దరు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. తాను కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు . ఈ ఘటనలో కూతురు చనిపోగా, తండ్రి కొడుకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పశ్చిమబెంగ రాష్ట్రంలో జరిగింది.
పశ్చిమబంగా రాష్ట్రంలోని జైగాం జిల్లాలో సోమ్ బహదూర్ చెట్రీ అనే వ్యక్తి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఓ కూతురు, కొడుకు ఉన్నారు.చెట్రీ సతీమణి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ సంబంధం కొనసాగించేందుకు భర్త, పిల్లలు అడ్డుగా ఉన్నారని ప్రియుడు చెప్పడంతో ఆమె అతనితో కలిసి పారిపోయింది. ఈ విషయం తెలిసిన చెట్రీ మనోవేదనకు గురయ్యాడు. తన భార్య చేసిన పనికి సమాజంలో తలెత్తుకొలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందాడు.
భార్య వేరే వ్యక్తితో కలిసి పారిపోవడం జీర్ణించుకోలేని చెట్రీ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఏడేళ్ళ కూతురు ప్రతీక, ఆరేళ్ళ కొడుకు ఆకాష్ లపై కత్తితో దాడి చేశాడు. కూతురు ప్రతీక అక్కడికక్కడే మరణించింది. వారిద్దరిపై దాడి చేసిన తాను గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నం చేసుకొన్నాడు. చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్న తండ్రి కొడుకులను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు.












Click it and Unblock the Notifications