Illegal affair: పక్కింటోడితో భార్య గర్బవతి అయ్యిందని ?, ఇద్దర్ని నరికి చంపేశాడు, నలుగురి మీద !

మైసూరు/బెంగళూరు: రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. వ్యవసాయం చేయిస్తున్న భర్త ప్రతిరోజు ఉదయం పొలం దగ్గరకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నాడు. 35 సంవత్సరాల వయసు ఉన్న భార్య గర్బవతి అయ్యింది. భార్యకు ప్రస్తుతం 8వ నెలలు. తన రెండో భార్య పక్కింటి కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని అతని కారణంగా నా భార్య తల్లి అయ్యిందని భర్తకు అనుమానం పెరిగిపోయింది. భార్య కూడా పదేపదే పక్కింటి యువకుడితో ఎక్కువగా మాట్లాడుతుండటంతో అతని అనుమానం ఇంకా ఎక్కువ అయ్యింది. రాత్రి కొడవలి తీసుకున్న భర్త అతని భార్య, అత్త మీద దాడి చేశాడు. ఇదే సమయంలో తన భార్య ప్రియుడు అనుకుంటున్న యువకుడి తల్లిదండ్రులను దారుణంగా నరికి చంపేశాడు. అడ్డువెళ్లిన మేనల్లుడు, మరో బంధువును కొడవలితో ఇష్టం వచ్చినట్లు నరికేసిన భర్త నడిరోడ్డు మీద కొడవలి చేతిలో పట్టుకుని కుర్చుని భార్య ప్రియుడిని కూడా చంపడానికి ఎదురు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

 మొదటి భార్య హత్య కేసులో జైలుకు

మొదటి భార్య హత్య కేసులో జైలుకు

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని నలవినూరు గ్రామంలో ఈరయ్య (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 15 సంవత్సరాల క్రితం ఈరయ్య కుటుంబ సభ్యులు చూసిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యను చంపేశాడని కేసు నమోదు కావడంతో ఈరయ్య జైలుకు వెళ్లి వచ్చాడు.

 రెండో పెళ్లి చేసుకున్నాడు

రెండో పెళ్లి చేసుకున్నాడు

జైలు నుంచి విడుదలైన కొంతకాలానికి ఈరయ్య మహదేవమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో కలిసి కాపురం చేస్తున్న ఈరయ్య వ్యవసాయం చేయిస్తున్నాడు. వ్యవసాయం చేయిస్తున్న మహదేవమ్మ భర్త ఈరయ్య ప్రతిరోజు ఉదయం పొలం దగ్గరకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంటున్నాడు.

 పక్కింటి కుర్రాడితో రెండో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని ?

పక్కింటి కుర్రాడితో రెండో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని ?

35 సంవత్సరాల వయసు ఉన్న ఈరయ్య రెండో భార్య మహదేవమ్మ గర్బవతి అయ్యింది. మహదేవమ్మ ప్రస్తుతం 8వ నెలలు. ఈరయ్య పక్కింటిలో దొడ్డగండయ్య (65), అక్కాజమ్మ (56) దంపతులు నివాసం ఉంటున్నారు. దొడ్డగండయ్య కొడుకు రవితో మహేదవమ్మ చాలా క్లోజ్ గా ఉంటున్నదని సమాచారం.

 పక్కింటోడి వలన నా భార్య తల్లి అయ్యిందని ?

పక్కింటోడి వలన నా భార్య తల్లి అయ్యిందని ?

తన రెండో భార్య మహదేవమ్మ పక్కింటి కుర్రాడు రవితో అక్రమ సంబంధం పెట్టుకుందని అతని కారణంగా నా రెండో భార్య తల్లి అయ్యిందని ఈరయ్యకు అనుమానం పెరిగిపోయింది. మహదేవమ్మ కూడా పదేపదే పక్కింటి యువకుడు రవితో ఎక్కువగా మాట్లాడుతుండటంతో అతని అనుమానం ఇంకా ఎక్కువ అయ్యింది.

 కొడవలితో అందర్ని నరికేశాడు

కొడవలితో అందర్ని నరికేశాడు

రాత్రి 8 గంటల సమయంలో మద్యం సేవించిన ఈరయ్య కొడవలి తీసుకున్న అతని రెండో భర్త మహదేవమ్మ, ఆమె తల్లి సన్న గౌరి మీద దాడి చేశాడు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో కుప్పకూలిపోయారు. అంతే ఆవేశంతో ఈరయ్య అదే కొడవలి తీసుకుని పక్కింటిలో నివాసం ఉంటున్న రవి తల్లిదండ్రులు దొడ్డగండయ్య, అక్కాజమ్మలను నరికి దారుణంగా చంపేశాడు.

 భార్య ప్రియుడి కోసం వేటాడాడు

భార్య ప్రియుడి కోసం వేటాడాడు

అడ్డువెళ్లిన మేనల్లుడు సురేష్, మరో బంధువు మహదేవను కొడవలితో ఇష్టం వచ్చినట్లు నరికేసిన భర్త నడిరోడ్డు మీద కొడవలి చేతిలో పట్టుకుని కుర్చుని భార్య మహదేవమ్మ ప్రియుడు రవిని కూడా చంపడానికి ఎదురు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. తరువాత రవి కోసం సుమారు 35 కిలోమీటర్ల దూరం బైక్ లో తిరిగిన ఈరయ్య అతని కోసం గాలించాడు.

 ఇద్దరి ప్రాణం పోయింది....ముగ్గురి పరిస్థితి విషమం

ఇద్దరి ప్రాణం పోయింది....ముగ్గురి పరిస్థితి విషమం

ఈరయ్య దెబ్బతో రవి తల్లిదండ్రులు ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈరయ్య రెండో భార్య మహదేవమ్మ, ఆమె తల్లి సన్నగౌరి మైసూరు ఆసుపత్రిలో, ఈరయ్య మేనల్లుడు సురేష్, మరో బంధువు మహదేవ బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారని పోలీసులు అన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన ఈరయ్యను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+