Illegal affair: తెలంగాణ నుంచి ప్రియుడిని పిలిపించి భర్తను చంపించిన భార్య, రెండు నెలలకు !
బెంగళూరు/ హైదరాబాద్: భర్తతో కలిసి అతని భార్య సంతోషంగా కాపురం చేసింది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో గత ఏడాది లాక్ డౌన్ అమలు చెయ్యడంతో దంపతులు హడలిపోయారు. గత ఏడాది భార్య ఆమె భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. భార్యను ఎక్కడికైనా బయటకు వెలుదామని భర్త చెబితే అమ్మో కరోనా వైరస్, నేను రాను అంటూ భార్య చెప్పింది. భార్యకు కరోనా వైరస్ అంటే భయం అనుకున్న ఆమె భర్త బయటకు వెళ్లి వచ్చాడు. కరోనా వైరస్ శాంతించే వరకు ఆమె భర్తతో కలిసి పుట్టింటిలోనే ఉంది. ఆ మద్యకాలంలో పక్కింటి కుర్రాడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలిసిపోయింది. ఇక్కడే ఉంటే నా కొంప మునిగిపోతుందని అనుకున్న భర్త అతని భార్యను అక్కడి నుంచి ఖాళీ చేయించాడు.
భర్తతో కలిసి ఆమె ముందు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లిన భార్య ప్రియుడిని పిలిపించుకుని ఎంజాయ్ చేసింది. కొంతకాలానికి భర్త శవమై కనిపించాడు. తన భర్త విపరీతంగా మద్యం సేవించి చనిపోయాడని అందరిని నమ్మించింది. అందరి సమక్షంలో అంత్యక్రియలు జరిగిపోయాయి. అయితే భర్త చనిపోయి రెండు నెలల కూడా కాకముందే భార్య ఆమె ప్రియుడితో కలిసి పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. ఇంటి తలుపు లాక్ చేస్తే రెండు మూడు రోజులు అయినా ప్రియుడు, ఆమె బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ప్రియుడిని కరెంట్ పోల్ కు కట్టేసిన స్థానికులు చితకబాదితే అప్పుడు అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

తెలంగాణ దంపతులు
తెలంగాణలోని అంతావరంగ ప్రాంతానికి చెందిన రాజప్ప రెడ్డి (39), అనుసూయ దంపతులకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. కొన్ని సంవత్సరాలు తెలంగాణ ఉన్న రాజప్ప రెడ్డి, అనుసూయ దంపతులు తరువాత కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని ముధోళలో కాపురం పెట్టారు. ముదోళలో భర్త రాజప్ప రెడ్డితో కలిసి అతని భార్య అనసూయ సంతోషంగా కాపురం చేసింది.

కరోనా దెబ్బతో తెలంగాణకు జంప్
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో గత ఏడాది లాక్ డౌన్ అమలు చెయ్యడంతో రాజప్ప రెడ్డి, అనసూయ దంపతులు హడలిపోయారు. గత ఏడాది అనసూయ ఆమె భర్త రాజప్ప రెడ్డితో కలిసి తెలంగాణలోని ఆమె పుట్టింటికి వెళ్లింది. అప్పట్లో భార్య అనసూయను ఎక్కడికైనా బయటకు వెలుదామని రాజప్ప రెడ్డి చెబితే అమ్మో కరోనా వైరస్, నేను రాను అంటూ భార్య చెప్పింది. తన భార్య అనసూయకు కరోనా వైరస్ అంటే భయం అనుకున్న ఆమె భర్త రాజప్ప రెడ్డి అతను మాత్రమే బయటకు వెళ్లి వచ్చాడు.

పక్కింటి కుర్రాడితో భార్య ఎంజాయ్
ఆ మద్యకాలంలో అనసూయ ఆమె పుట్టింటి సమీపంలోనే పక్కింటిలో నివాసం ఉంటున్న శ్రీశైలం అనే కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త రాజప్ప రెడ్డి పని మీద బయటకు వెళ్లి వస్తుంటే అతని భార్య అనసూయ ఆమె ప్రియుడు శ్రీశైలంను ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసింది. కొంతకాలానికి అనసూయ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త రాజప్ప రెడ్డికి తెలిసిపోయింది.

భయంతో భార్యను పిలుచుకుని వచ్చేసిన భర్త
తన భార్య అనసూయ పుట్టింటిలోనే ఉంటే నా కొంప మునిగిపోతుందని అనుకున్న రాజప్ప రెడ్డి భర్తను పుట్టింటి నుంచి ఖాళీ చేయించాడు. తరువాత రాజప్ప రెడ్డి అతని భార్యతో కలిసి కర్ణాటకలోని ముధోళలో నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లిపోయారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఇక ముందు మర్యాదగా ఉండాలని రాజప్ప రెడ్డి అతని భార్య అనసూయకు వార్నింగ్ ఇచ్చాడు.

మద్యంలో నిద్రమాత్రలు మిక్స్..... ప్రియుడితో భర్తను చంపిన భార్య
తెలంగాణలో ఉన్న ప్రియుడు శ్రీశైలంను ముధోళకు పిలిపించుకుంటున్న అనసూయ అతనితో ఎంజాయ్ చేసింది. ఆగస్టు నెలలో ప్రియుడు శ్రీశైలతో కలిసి అనసూయ ఆమె భర్త రాజప్పరెడ్డికి అడ్డంగా చిక్కిపోయింది. ఆ సమయంలో రాజప్ప రెడ్డి అతని భార్య అనుసూయను చితకబాదేశాడు. తరువాత ఆగస్టు నెలలోనే అనసూయ, శ్రీశైల కలిసి రాజప్ప రెడ్డికి మద్యంలో నిద్రమాత్రలు కలిపి అతనితో తాగించి తరువాత అతని గొంతు నులిమి చంపేశారు.

రెండు నెలలకే ప్రియుడితో ఎంజాయ్
తన భర్త రాజప్ప రెడ్డి విపరీతంగా మద్య సేవించి రాత్రి నిద్రలోనే చనిపోయాడని అనసూయ అందరిని నమ్మించింది. మామూలుగా రోజూ మద్యం సేవిస్తున్న రాజప్ప రెడ్డి నిజంగానే మద్యం సేవించి చనిపోయాడని అందరూ అనుకున్నారు. ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా రాజప్ప రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేసిన అతని భార్య అనసూయ కేసు నుంచి తప్పించుకుంది.
Recommended Video

ప్రియుడిని చితకబాదితే రాజప్ప రెడ్డి మర్డర్ మ్యాటర్ లీక్
భర్త రాజప్ప రెడ్డి చనిపోయి రెండు నెలల కూడా కాకముందే అతని భార్య అనసూయ ఆమె ప్రియుడు శ్రీశైలను ముధోళకు పిలిపించుకుని అతనితో కలిసి పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. ఇంటి తలుపు లాక్ చేస్తే రెండు మూడు రోజులు అయినా ప్రియుడు శ్రీశైలా, అనసూయ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. శుక్రవారం ప్రియుడు శ్రీశైలను ఇంటి నుంచి బయటకు లాగిన స్థానికులు అతన్ని కరెంట్ పోల్ కు కట్టేసి చితకబాదేశారు. ఆ సమయంలో శ్రీశైలా అనసూయ భర్త రాజప్ప రెడ్డిని తాము హత్య చేశామని అసలు మ్యాటర్ బయటకు చెప్పాడు. ముధోళ పోలీసులు అనసూయ, ఆమె ప్రియుడు శ్రీశైలను అరెస్టు చేసి రెండు నెలల తరువాత హత్య కేసు నమోదు చెయ్యడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications