అక్రమ సంబంధం, అర్దరాత్రి ప్రియురాలిని పిలిపించి ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్?

లక్నో/ఉత్తరప్రదేశ్: కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని ఓ యువతి వివాహం చేసుకుంది. ఏడాది పాటు దంపతులు హ్యాపీగా కాపురం చేశారు. భార్య తీరుతో ఆమెకు భర్త దూరం అయ్యాడు. భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటున్న భార్య మరో యుకువడితో అక్రమ సంబందం పెట్టుంది. ప్రియుడితో కలిసి ఆమె పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. అర్దరాత్రి రావాలని ప్రియురాలికి ప్రియుడు ఫోన్ చేశాడు. ప్రియుడు చెప్పిన చోటకు ప్రియురాలు వెళ్లడంతో అక్కడ బాయ్ ఫ్రెండ్ తో పాటు మరో నలుగురు ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ లో రాంబ్రి (30) అనే యువతి నివాసం ఉంటున్నది. 2015లో రాంబ్రి కుటుంబ సభ్యులు అరుణ్‌ అనే యువకుడితో ఆమె వివాహం జరిపించారు. ఇరువైపు కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి కావడంతో ఏడాది పాటు అరుణ్ అతని భార్య రాంబ్రితో చక్కగా కాపురం చేశాడు. తరువాత అరుణ్, రాంబ్రి దంపతుల మధ్య తేడాలు వచ్చాయి.

Illicit relationship, boyfriend who killed his pregnant girlfriend with friends in Uttar Pradesh

రానురాను అరుణ్, రాంబ్రి దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు రాజీ చేసినా వారు మాత్రం కలిసి ఉండలేమని అన్నారు. గొడవల కారణంగా వివాహం జరిగిన ఒక సంవత్సరం తర్వాత అరుణ్, రాంబ్రి దంపతులు విడిపోయారు. రాంబ్రి తన తండ్రి ఇంట్లో నివసించడం ప్రారంభించింది. ఈ క్రమంలో రాంబ్రి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదేశ్ అనే యువకుడితో పరిచయం పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

గత మూడు సంవత్సరాల నుంచి ఆదేశ్, రాంబ్రి అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్నాళ్ల పాటు వారి అక్రమ సంబంధం కొనసాగుతుండగా ఇటీవల రాంబ్రి ఆమె ప్రియుడు ఆదేశ్ కారణంగా గర్బవతి అయ్యింది. తాను గర్బవతి అయ్యానని, తనను పెళ్లి చేసుకోవాలని రాంబ్రి ఆమె ప్రియుడి మీద ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అయితే ఇంతకాలం ఎంజాయ్ చేశాము, సెకండ్ హ్యాండ్ దాన్ని నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలని ఆదేశ్ పెళ్లి విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదు.

పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు రాంబ్రి పట్టుబట్టడంతో ఆమెను ఎలాగైనా తొలగించుకోవాలని ప్రియుడు ఆదేశ్ అనుకున్నాడు. ప్రియురాలు రాంబ్రి పీడ వదిలించుకోవడానికి ఆదేశ్ ఒక ప్లాన్‌ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారం జూలై 2వ తేదీ రాత్రి ఒంటరిగా రావాలని ఆదేశ్ అతని ప్రియురాలు రాంబ్రికి ఫోన్ చేసి ఆమెను రొమాన్స్ చెయ్యడానికి ఆహ్వానించాడు.

అదే రోజు అర్ధరాత్రి పట్టణం సమీపంలోని పొలానికి రాంబ్రి వెళ్లింది. ఆ సమయంలో ఆదేశ్ తన నలుగురు స్నేహితులతో కలిసి గర్భిణి ప్రియురాలు రాంబ్రిని చితకబాది ఆమెను అక్కడే చంపేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం మహిళ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హత్యకు గురైయ్యింది రాంబ్రి అని పోలీసులు నిర్దారించారు. రాంబ్రి మొబైల్ ఫోన్ కాల్స్ ఆధారాలతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఆదేశ్‌కు సంబంధించిన వివరాలు పోలీసులకు అందాయి. ఆ తర్వాత ఆదేశ్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు జరిపిన విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో ప్రియుడు ఆదేశ్‌, అతని స్నేహితులు ఆర్యన్‌, సందేశ్‌, రోహిత్‌, దీపక్‌లను కూడా పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+