నా పోరాటానికి మద్దతు కావాలి: తీహార్ జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తాను నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం కారులో వెళ్తూ ప్రజలకు కేజ్రీవాల్ అభివాదం చేశారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ వారికి అభివాదం చేస్తూ ప్రసంగించారు. హనుమాన్ దయ వల్లే బయటకు వచ్చానని అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తానని చెప్పారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జడ్జిలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి వల్లే ఈరోజు మీ ముందుకొచ్చానని తెలిపారు కేజ్రీవాల్.
'నన్ను ఆశీర్వదించిన కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞతలు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి. నా శక్తిమేరకు పోరాడతాను. కానీ, 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలి. శనివారం మధ్యాహ్నం 1 గంటకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తాం' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, కేజ్రీవాల్ ఇంటి వద్ద ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 50 రోజుల తర్వాత విడుదలైన కేజ్రీవాల్ తన కాన్వాయ్‌లో ఇంటికి బయల్దేరారు. వాహనంలో ఆయన సతీమణి సునీత, కుమార్తె హర్షిత, ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ ఉన్నారు. కేజ్రీవాల్ నివాసం వద్ద, పార్టీ కార్యాలయం వద్ద ఆప్ శ్రేణులు టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నాయి.
#WATCH | Delhi CM Arvind Kejriwal addresses party workers after being released from Tihar jail.
— ANI (@ANI) May 10, 2024
CM Kejriwal says, "Tomorrow at 11 am we will go to the Hanuman Temple at Connaught Place and at 1 pm, we will address a press conference at the party office."
The Supreme Court… pic.twitter.com/76ij5KZ4iw

సీఎం కార్యాలయానికి అనుమతి లేదు
కాగా, అంతకుముందు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకు అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్ 1 వరకు బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. రూ.50వేల పూచీకత్తు, అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటీపై ఈ బెయిలిచ్చింది.
అయితే, కేజ్రీవాల్‌కు జూన్ 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సీఎం తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చేసిన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. జూన్ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని స్పష్టం చేసింది. బెయిల్ నిబంధనలను కేజ్రీవాల్ తప్పనిసరిగా పాటించాలని తేల్చి చెప్పింది. సీఎం కార్యాలయానికి గానీ, ఢిల్లీ సచివాలయానికి గానీ వెళ్లొద్దని ఆదేశించింది. లిక్కర్ కేసులో తనపై వచ్చిన అభియోగాల గురించి కూడా మాట్లాడొద్దని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన అధికారిక ఫైళ్లను చూడొద్దని, సాక్షులతో మాట్లాడొద్దని స్పష్టం చేసింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications