రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం కేసు, 15 మంది ఐపీఎస్ లు టార్గెట్, సీబీఐ పంజా, దాడులు!

బెంగళూరు: కర్ణాటకలోని 14 ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారుల ఇండ్లు, కార్యాలయాల మీద సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసుకుని సీబీఐ అధికారులు దాడులు చేశారని ప్రచారం జరుగుతోంది. రూ. వేల కోట్ల రూపాయల ఐఎంఏ స్కాం కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారుల మీద సీబీఐ అధికారులు పంజా విసిరారని సమాచారం.

సీనియర్ ఐపీఎస్ అధికారి హేమంత్ నింబాళ్కర్ తో సహ ఐపీఎస్ అధికారుల ఇండ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు, ఐపీఎస్ అధికారులతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ డీఎస్పీ శ్రీధర్, ఎస్పీ అజయ్ హిలోరి తదితరులను సీబీఐ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

IMA scam case, CBI Raid On IPS Officers In Karnataka

కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాం కేసును సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఐఎంఏ స్కాం కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు బెంగళూరు, మండ్య, రామనగర, బెళగావి, ఉత్దరప్రదేశ్ లోని మీరట్ తదితర 16 కోట్ల సోదాలు చేస్తున్నారని తెలిసింది.

ఐఎంఏ స్కాం కేసును మొదట సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారు. అందులో భాగంగా సీఐడీ విభాగం ఐజీపీ హేమంత్ నింబాళ్కర్ అప్పటి బెంగళూరు నగర తూర్పు విభాగం డీసీపీ అజయ్ హిలోరి, బీడీఏ చీఫ్ ఇంజనీర్ పీడీ. కుమార్ తదితర అధికారుల ఇండ్లు, కార్యాలయాల మీద దాడులు చేసిన సీబీఐ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+