ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు: గుజరాత్ తోపాటు దక్షిణ, ఈశాన్య భారత్‌లోనూ జోరు వానలు
న్యూఢిల్లీ: కొంత విరామం తర్వాత దేశంలో నైరుతి రుతుపవనాలు చురుక్కుగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దీంతో దక్షిణ భారతదేశంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉండటంతో ఆంధ్రపదేశ్, ఒడిశా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

దక్షిణ, మధ్య భారతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
మధ్య, దక్షిణ భారతదేశంలో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గుజరాత్ తోపాటు ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. జులై చివరి వారంలో దేశంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంత విరామం వచ్చింది. పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భాల్లో వచ్చే ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో, బుధ, గురువారాల్లో తెలంగాణ రాష్ట్రంలో, ఆగస్టు 16-19 వరకు జార్ఖండ్ రాష్ట్రంలో, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో, ఆగస్టు 16-20 వరకు సిక్కింలో వర్షాలు కురుస్తున్నాయి.

ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాలు
ఆగస్టు 19 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, ఆగస్టు 18 వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణ, విదర్బాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు రోజలపాటు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈశాన్య భారతదేశంలో కూడా రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోనూ రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అల్పపీడనంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయనివాతావరణశాఖ వెల్లడించింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణలో పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నేడు రేపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Recommended Video

ఏపీలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు.. హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తర కోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని తెలిపారు వాతావరణశాఖ అధికారులు. ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 5కిలో మీటర్ల ఎత్తులో ఉంది. అటు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఏపీ సముద్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా ఉంటుందని.. వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
-
పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications