మోదీ ఫస్ట్, రాహుల్ సెకండ్ : ప్రచారంలో నేతల దూకుడు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మరో రెండు దశల్లో పోలింగ్ ప్రక్రియ ముగిస్తే సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి. ఇప్పటికే 424 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. మరో 118 స్థానాలకు ఆరు, ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ తుదిదశకు చేరుతోంది. ఈ సందర్భంగా ఏ నేత ఎన్ని ర్యాలీల్లో పాల్గొన్నారు ? ప్రచారంలో ఎవరూ ముందంజలో ఉన్నారో ఓసారి పరిశీలిద్దాం.

మోదీ ఫస్ట్
గత నెల 11న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక అప్పటినుంచి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు ప్రధానీ మోదీ. ఇప్పటివరకు 110 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు మోదీ. ఆ తర్వాతే మిగతా నేతలు ఉన్నారు. మోదీ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా కూడా ఉత్సాహంగా క్యాంపెయిన్ చేస్తున్నారు.

రాహుల్ సెకండ్
ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో దూసుకెళుతోంది. రాహుల్ కూడా 103 చోట్ల ప్రచారం నిర్వహించి మోదీకి అడుగుదూరంలో నిలిచారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ప్రచారం చేస్తున్నారు రాహుల్. చౌకీదార్ చోర్ హై నినాదాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, మోదీని విమర్శిస్తూ రాహుల్ ప్రచారం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా క్యాంపెయిన్ లో దూసుకెళ్తున్నారు. వీరితోపాటు యూపీఏ చైర్ పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలతో మమేకమవుతున్నారు.

బాబుకు మద్దతుగా ..
వీరితోపాటు మాజీ ప్రధాని దేవేగౌడ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ అధినేత కేజ్రీవాల్ నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు ఫరూక్ అబ్దుల్లా తదితర నేతలు ఏపీ సీఎం చంద్రబాబు కోసం ఏపీలో ప్రచారం చేస్తారు. కర్ణాటకలో జేడీఎస్, తమిళనాడులో డీఎంకే పార్టీకి మద్దతుగా చంద్రబాబు కూడా ప్రచారం చేశారు.

ములాయం-మాయావతి ప్రచారం
బీజేపీని గద్దె దింపాలనే లక్ష్యంతో ఒక్కటైన ఎస్పీ బీఎస్పీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అంతేకాదు ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, మాయావతి ఒకేవేదికను పంచుకోవడం ఈసారి ప్రచారంలో హైలెట్ గా నిలిచింది.












Click it and Unblock the Notifications